ETV Bharat / bharat

'కరోనా‌ సోకితే మమతా బెనర్జీని ఆలింగనం చేసుకుంటా' - mamat banerjee latest news

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అనుపమ్​ హజ్రా. రాష్ట్రంలోని భాజపా శ్రేణులు.. కరోనా కంటే పెద్ద శత్రువైన మమతా బెనర్జీతో యుద్ధం చేస్తున్నారని తెలిపారు. కరోనా బాధితులను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించిన హజ్రా.. తనకు కరోనా సోకితే మమతా బెనర్జీని ఆలింగనం చేసుకుంటానని వెల్లడించారు.

BJP leader anupam hazra says he will hug mamat banerjee if infected with covid 19
'కొవిడ్‌ వస్తే మమతా బెనర్జీని ఆలింగనం చేసుకుంటా'
author img

By

Published : Sep 27, 2020, 11:27 PM IST

బంగాల్​లో అధికార తృణమూల్​ కాంగ్రెస్​, విపక్ష భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా... బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అనుపమ్‌ హజ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కరోనా సోకితే... సీఎంను ఆలింగనం చేసుకుంటానని తెలిపారు.

దక్షిణ 24 పరాగనా జిల్లాలో భాజపా కార్యకర్తలతో అనుపమ్ ఇటీవలే ఓ‌ భేటీ నిర్వహించారు. భారీ సంఖ్యలో హాజరైన నేతలు, కార్యకర్తలు పెద్దగా మాస్కులను ధరించలేదు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు హజ్రా. అయితే వాటికి సమాధానమిస్తూ.. కరోనా కంటే పెద్ద శత్రువు మమతా బెనర్జీ అని ఎద్దేవా చేశారు.

"మా కార్యకర్తలు ‌బంగాల్​లో.. కొవిడ్‌-19 కంటే పెద్ద శత్రువుతో పోరాడుతున్నారు. వాళ్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తలపడుతున్నారు. కార్యకర్తలు కొవిడ్‌ బారిన పడలేదు. అందుకే భయపడడం లేదు. ఒకవేళ నాకే కొవిడ్‌ వస్తే నేను మమతా బెనర్జీని ఆలింగనం చేసుకుంటా. మహమ్మారి సోకిన వ్యాధిగ్రస్తులను సీఎం సరిగా పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలను కిరోసిన్‌తో కాల్చేశారు. మృతి చెందిన కుక్కలు, పిల్లులను కూడా మేం అలా చూడలేదు," అని విమర్శలు గుప్పించారు అనుపమ్‌ హజ్రా.

భాజపా నేత వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరిపక్వత లేని, మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులే అలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. తెలివైన వ్యక్తి ఎవరైనా సరే ఆ మాటలను వింటే హజ్రా పరిస్థితి ఏంటో చెబుతారని ఎద్దేవా చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికల ముందు అనుపమ్‌ హజ్రా టీఎంసీని వీడి భాజపాలో చేరారు. ఆ ఎన్నికల్లో టీఎంసీ తరఫున పోటీ చేసి.. మిమి చక్రవర్తి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇదీ చూడండి: కర్ణాటకలో 5.75 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.