బిహార్‌లో భాజపా-జేడీయూ పొత్తును క్రికెట్లో సచిన్-సెహ్వాగ్ జోడీతో పోల్చారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. సచిన్-సెహ్వాగ్‌లా తమది కూడా సూపర్ హిట్ జోడీ అని అభివర్ణించారు. బిహార్‌లో కూటమి ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిపై ఎవరైనా చర్చించవచ్చని.. కానీ, అవినీతి విషయంలో సీఎం నితీశ్ కుమార్ వైపు ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేరని అన్నారు.
భగల్పుర్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజ్‌నాథ్... విపక్షాలపై విరుచుకుపడ్డారు. లాంతరు(ఆర్జేడీ ఎన్నికల గుర్తు) పగిలిపోయిందని, ఇప్పుడు అది పనిచేయదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 15 ఏళ్ల ఆర్జేడీ పాలన, నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి పాలన మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారన్నారు. దశాబ్దాల పాటు తాగునీరు, విద్యుత్, రహదారుల లేమితో సతమతమవుతున్న బిహార్ ప్రజలకు తమ ప్రభుత్వం కనీస అవసరాలన్నింటినీ అందించిందని తెలిపారు.
-
#WATCH Defence Minister Rajnath Singh addresses a public rally in Barhara of Bhojpur district. He says, "Don't reject the pair of BJP-JD(U). This pair is like the opening pair of Sachin-Sehwag in cricket."#BiharElections2020 pic.twitter.com/Du9Jr4nt6P
— ANI (@ANI) October 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Defence Minister Rajnath Singh addresses a public rally in Barhara of Bhojpur district. He says, "Don't reject the pair of BJP-JD(U). This pair is like the opening pair of Sachin-Sehwag in cricket."#BiharElections2020 pic.twitter.com/Du9Jr4nt6P
— ANI (@ANI) October 21, 2020#WATCH Defence Minister Rajnath Singh addresses a public rally in Barhara of Bhojpur district. He says, "Don't reject the pair of BJP-JD(U). This pair is like the opening pair of Sachin-Sehwag in cricket."#BiharElections2020 pic.twitter.com/Du9Jr4nt6P
— ANI (@ANI) October 21, 2020
"బిహార్ ప్రజలు 15 ఏళ్ల లాంతరు(ఆర్జేడీ ఎన్నికల గుర్తు) పాలనను చూశారు. భాజపా-జేడీయూ పాలనలో అభివృద్ధిని చూశారు. ఈ రెండు ప్రభుత్వాల పనితీరును పోల్చి చూడటం తగదు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పూర్తిగా రూపాంతరం చెందింది. బిహార్ కోసం నితీశ్ కుమార్ ప్రతి ఒక్కటి చేశారని నేను వాదించను. ఆయన తక్కువ పనిచేశారా, తగినంత చేశారా, ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉందా అనే విషయాలపై చర్చించుకోవచ్చు. కానీ ఆయన నిజాయితీపై ఎలాంటి చర్చ ఉండదు. అవినీతి విషయంలో నితీశ్ కుమార్‌ను ఎవరూ వేలెత్తి చూపించలేరు."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు రాజ్‌నాథ్. పేదలకు సాధికారత కల్పించడమే కాకుండా వారి జీవనప్రమాణాలను మెరుగుపరిచారని తెలిపారు. గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో బిహార్‌కు చెందిన సైనికులు పరాక్రమాన్ని ప్రదర్శించారని కీర్తించారు.
"గల్వాన్‌లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. బిహార్ రెజిమెంట్ సైనికులు మాతృభూమి ఆత్మగౌరవాన్ని కాపాడారు. తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి త్యాగాలకు కృతజ్ఞతలు చెబుతున్నా."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 మధ్య మూడు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 10 ఓట్ల లెక్కింపు జరగనుంది. భాజపా-జేడీయూ సంయుక్తంగా పోటీ చేస్తున్నాయి. విపక్షాల మహా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామ పక్షాలు ఉన్నాయి.
ఇదీ చదవండి- ప్రశాంత్ కిశోర్ ఎల్జేపీ కోసం పని చేస్తున్నారా?