మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే శ్రద్ధ కనబరుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగ కల్పనపై ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై మీడియా కథనాన్ని ఉదహరించారు. భాజపా హయాంలో సున్నా ఉద్యోగాలే సాధ్యమని వ్యంగస్త్రాలు సంధించారు.
"ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, రాజకీయాలు చేయడానికే ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపిస్తున్నప్పుడు... వారు ఏ రంగాల్లో విఫలమవుతున్నారో అనే విషయాలపై మనం దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి దాచాలని ప్రయత్నిస్తోన్న వారి వైఫల్యాలు ఏంటి? గణాంకాల ప్రకారం భాజపా ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకం దారుణంగా విఫలమైంది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుంది. భాజపా ప్రభుత్వం ఉంటే సున్నా ఉద్యోగాలే సాధ్యం."-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇదీ చూడండి: బంజారాహిల్స్లో వ్యక్తి దారుణ హత్య