మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు దిల్లీలో సమావేశమైంది భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ. ఈ భేటికి ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు.
మహారాష్ట్రలో శివసేనతో సీట్ల పంపకంపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన ఉండే అవకాశముందని పార్టీ నేత ఒకరు చెప్పారు. మహారాష్ట్రలో 288 సీట్లలో శివసేనకు 120-125 స్థానాల్లో పోటీ చేసే వీలుందన్నారు. అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని వచ్చినందుకు సమావేశంలో మోదీకి సన్మానం చేసినట్లు తెలిపారు.
మహారాష్ట్ర, హరియాణాలో అక్టోబరు 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: మహా పోరు: కాంగ్రెస్ తొలి జాబితాలో అశోక్ చవాన్