పౌరసత్వ చట్ట సవరణపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను శాంతింపజేయడానికి భాజపా చర్యలు ప్రారంభించింది. చట్టానికి అనుకూలంగా ప్రచారాలు నిర్వహించి.. ముస్లిం సహా ఏ ఇతర మతానికీ కేంద్రం వ్యతిరేకం కాదని ప్రజలకు తెలియజేయనుంది కాషాయ పార్టీ. ఈ మేరకు అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ప్రకటన విడుదల చేశారు. భాజపా కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రచారాలు చేస్తారని స్పష్టం చేశారు.
"ఈ చట్టంలో మన ముస్లిం సోదరి సోదరుల హక్కులను హరించే నిబంధన ఒక్కటి కూడా లేదు. అయితే బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ వంటి దేశాలలో మతపరమైన హింసను ఎదుర్కొంటున్నవారికి భారతదేశంలో పౌరహక్కులు కల్పించబడతాయి."
-సంబిత్ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి
మూడు పొరుగుదేశాల్లో ఉన్న మైనారిటీలకు పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో పౌరసత్వ సవరణ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు అనుకూల ప్రచారం చేపట్టేందుకు 11 రాష్ట్రాల్లోని భాజపా కార్యవర్గానికి జాతీయ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: మంచి నీటి బావిలో పెట్రోల్ ఊరడం చూశారా?