TGSRTC Bumper Offer For Passengers Traveling in AC Busses : ఆర్టీసీ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ కలిగిన ప్యాసింజర్స్ తమ వద్ద ఉన్న బస్‌పాస్‌లతో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌పై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్పక్ బస్‌పాస్ కలిగిన ప్రయాణికులు ఈ రాయితీని పొందవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో సుమారు 70 వేల వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాసులున్నాయని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వారిలో ఎక్కువ మంది వీకెండ్‌లో సొంతూళ్లకు వెళ్తున్నారని, ఈ నేపథ్యంలోనే బస్‌పాసుదారుల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ఇస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సంస్థ అధికారిక వెబ్‌సైట్ http://tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని డిస్కౌంట్‌ను పొందవచ్చన్నారు. జనరల్ బస్‌పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నామని వీసీ సజ్జనార్ తన సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
హైదరాబాద్ లోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారులకు శుభవార్త!! తమ దగ్గర ఉన్న బస్ పాస్ తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్ లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ… pic.twitter.com/QINAoc8HlA
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) November 11, 2024
టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్లు : మరోవైపు కార్తిక మాసం సందర్భంగా భక్తులకు మరింత సేవలను అందిస్తూ ఎప్పటికప్పుడు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల శబరిమల యాత్రకి బస్సు బుక్ చేసుకున్న అయ్యప్ప స్వాములతో పాటు ఒక గురుస్వామికి, పది సంవత్సరాలలోపు ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంట వాళ్లకు, ఒక అటెండెంట్‌కు ఉచిత ప్రయాణం కల్పించబడుతుందని ఆర్టీసీ యజమాన్యం ప్రకటించింది. అదేవిధంగా వివాహ శుభకార్యాలకు, విహారయాత్రలకు బస్సులు అద్దెకు తీసుకునే వారికి అద్దె ఫీజును 15 నుంచి 20 శాతం తగ్గించినట్లు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. కార్తిక మాసం సందర్భంగా పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. వరంగల్, మధిర, భద్రాచలం, నల్గొండ, దేవరకొండ, కోదాడ, ఖమ్మం, సత్తుపల్లి, మణుగూరు, మిర్యాలగూడ, యాదగిరిగుట్ట, సూర్యాపేట ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 17,24 వ తేదీల్లో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
భక్తులకు అదిరిపోయే శుభవార్త - కార్తికమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్ సర్వీస్
టిక్కెట్ ఛార్జీల పెంపుపై తెలంగాణ ఆర్టీసీ క్లారిటీ - కేవలం ఆ బస్సుల్లో మాత్రమేనట!