కేరళ వయనాడ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీకి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తుషార్ వెల్లప్పల్లిని బరిలోకి దింపింది భాజపా. తుషార్ కేరళలో ఎన్డీఏ కూటమి భాగస్వామి 'భారత్ ధర్మ జన సేన పార్టీ (బీడీజేఎస్)' అధ్యక్షుడు.
I proudly announce Shri Thushar Vellappally, President of Bharat Dharma Jana Sena as NDA candidate from Wayanad.
— Chowkidar Amit Shah (@AmitShah) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A vibrant and dynamic youth leader, he represents our commitment towards development and social justice. With him, NDA will emerge as Kerala's political alternative.
">I proudly announce Shri Thushar Vellappally, President of Bharat Dharma Jana Sena as NDA candidate from Wayanad.
— Chowkidar Amit Shah (@AmitShah) April 1, 2019
A vibrant and dynamic youth leader, he represents our commitment towards development and social justice. With him, NDA will emerge as Kerala's political alternative.I proudly announce Shri Thushar Vellappally, President of Bharat Dharma Jana Sena as NDA candidate from Wayanad.
— Chowkidar Amit Shah (@AmitShah) April 1, 2019
A vibrant and dynamic youth leader, he represents our commitment towards development and social justice. With him, NDA will emerge as Kerala's political alternative.
"వయనాడ్ ఎన్డీఏ అభ్యర్థిగా భారత్ ధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లిని ప్రకటిస్తున్నందుకు గర్విస్తున్నా. సామాజిక న్యాయం, అభివృద్ధే లక్ష్యంగా మాతో ముందుకు సాగుతారు. కేరళ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎన్డీఏ అవతరిస్తుంది."
-ట్విటర్లో అమిత్ షా
శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం(ఎస్ఎన్డీపీ) ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేశన్ వారసుడు తుశార్ వెల్లప్పల్లి. కేరళలో ఈళవా సామాజిక వర్గ సంక్షేమానికి ఎస్ఎన్డీపీ కృషి చేస్తోంది. స్థానిక రాజకీయాలను ప్రభావితం చేయగలరనే అంచనాతోనే తుషార్‌ను రాహుల్‌పై బరిలో దింపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
అమేఠీలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహల్ గాంధీ కేరళలో వయనాడ్‌ను రెండో స్థానంగా ఎంచుకున్నారని అమిత్ షా ఇదివరకే విమర్శించారు.
ఇదీ చూడండి:భారత్ భేరి: 'రంగీలా' రాజకీయం ఫలించేనా?