ETV Bharat / bharat

శిశువు అనుకుని బొమ్మకు పోస్ట్​మార్టం... చివరకు...

మహారాష్ట్రలో ఓ 'బొమ్మ' మృతికి కారణాలేంటో తెలుసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వైద్యులు ఆ 'బొమ్మ'కు పోస్టు​మార్టం నిర్వహించారు. అప్పుడే మరి, అసలు సంగతి బయటపడింది. 'బొమ్మ' మృతి చెందడమేంటి.. పోస్ట్​మార్టం చేయడమేంటి అనుకుంటున్నారా? అయితే, పూర్తి కథనం చదివేయండి.

Bizarre! Corpse found floating in river turns out to be a doll
పోలీసులనే పరేషాన్​ చేసిన బొమ్మ!
author img

By

Published : Jul 12, 2020, 2:36 PM IST

మహారాష్ట్ర బుల్డానాలో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. చిన్నారి మృతదేహం అనుకుని, ఓ బొమ్మను స్టేషన్​కు పట్టుకొచ్చారు పోలీసులు. తీరా పోస్టుమార్టం చేశాక అసలు సంగతి తెలిసింది.

Bizarre! Corpse found floating in river turns out to be a doll
పోలీసులనే పరేషాన్​ చేసిన బొమ్మ!

బుల్డానా జిల్లా ఖామ్​గావ్ తాలూకా బోర్జావాల్ గ్రామంలో గురువారం ఓ 'చిన్నారి' మృతదేహం నదిలో తేలుతూ కనిపించింది. అది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు.

ఆ మృతదేహాన్ని పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టంకు పంపించారు. తీరా అప్పుడు తెలిసింది.. అది శిశువు శవం కాదు, అచ్చం చిన్నారిలా కనిపించే ఓ బొమ్మ అని. ​

ఇదీ చదవండి: బొమ్మను వివాహం చేసుకున్న యువకుడు.. కారణం ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.