వరదల ధాటికి బిహార్ గజగజలాడుతోంది. వరుసగా నాలుగో రోజు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించడం వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
బిహార్ ఉపముఖ్యమంత్రి కూడా వరద ముప్పు నుంచి తప్పించుకోలేకపోయారు. పట్నా రాజేంద్ర నగర్లోని సుశీల్ కుమార్ మోదీ నివాసం జలదిగ్భందంలో చిక్కుకుంది. అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం.. సుశీల్ మోదీ సహా ఆయన కుటుంబ సభ్యులను రక్షించింది. పడవల సాయంతో వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చింది. తమను రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఉపముఖ్యమంత్రి.
ఉపముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉండటం వల్ల సామాన్యులు మరింత భయపడిపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
బిహార్లో భారీ వర్షాలకు ఇప్పటివరకు 29 మంది మరణించారు.
ఇదీ చూడండి:- ఉత్తరాదిలో వరుణ బీభత్సం- 137 మంది మృతి