ETV Bharat / bharat

'బిహార్​ ఎన్నికల్లో 1197 మంది అభ్యర్థులకు నేరచరిత్ర' - COVID-19 guidelines vioated in bihar elections

బిహార్​ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో 1197మంది అభ్యర్థులకు నేరచరిత్ర ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో 467మంది గుర్తింపు పొందిన పార్టీల తరఫున పోటీ చేశారని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీలు తమ అభ్యర్థుల వివరాలను బహిర్గతం చేశాయి.

Bihar polls saw 1197 candidates with criminal antecedents contesting
'బిహార్​ ఎన్నికల్లో 1197మంది అభ్యర్థులకు నేరచరిత్ర'
author img

By

Published : Nov 22, 2020, 6:59 PM IST

ఇటీవల జరిగిన బిహార్​ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను ప్రకటించింది ఎన్నికల సంఘం. మొత్తం అభ్యర్థుల్లో 1197మంది నేరచరిత్ర కలిగి ఉన్నారని వెల్లడించింది. ఇందులో 467మంది గుర్తింపు పొందిన పార్టీల నుంచే పోటీ చేశారని వివరించింది. మిగతా 730మంది గుర్తింపు లేని పార్టీల నుంచి, కొందరు స్వతంత్రం​గా పోటీ చేశారని వివరించింది.

బిహార్​ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 3,733మంది అభ్యర్థుల్లో 371మంది మహిళలు ఉన్నారని తెలిపింది. ఎన్నికల ప్రచారంలో కొవిడ్​-19 నిబంధనలను ఉల్లంఘించిన అభ్యర్థులపై 156కేసులు నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. కొంతమందిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, సాంక్రమిత వ్యాధుల చట్టం కింద కేసులు నమోదైనట్టు తెలిపింది.

కరోనా సమయంలో జరిగిన అతిపెద్ద ఎన్నికగా బిహార్​ ఎన్నికలు నిలిచాయి. దాదాపు 4కోట్లమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.