ETV Bharat / bharat

బిహార్​లో లాంతరు రోజులు పోయాయ్​: మోదీ

author img

By

Published : Oct 23, 2020, 5:55 PM IST

బిహార్​ ప్రజలు లాంతరు పట్టుకునే రోజులు పోయాయన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఇప్పుడు రాష్ట్రమంతటా విద్యుత్ సరఫరా ఉన్నట్లు తెలిపారు. 1990లలో రాష్ట్రాన్ని పాలించిన వారి వల్ల ప్రజలు ఇప్పటికీ బాధపడుతున్నారని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. గయాలో నిర్వహించిన ర్యాలీలో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిపై విమర్శలు గుప్పించారు.

Bihar now has electricity, days of lantern over: Modi
బిహార్​లో లాంతరు రోజులు పోయాయ్​: మోదీ

ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 1990ల నాటి అరాచక పాలన కారణంగా బిహార్​ను ఇప్పటికీ సమస్యలు పీడిస్తున్నాయని ఆరోపించారు.

గయాలో ఎన్డీఏ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఉందని, లాంతరు పట్టుకునే రోజులు పోయాయని ఆర్జేడీ ఎన్నికల గర్తును ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

" జాతి వ్యతిరేక కార్యకలాపాలతో నిండిన బుట్ట వంటిదే మహాకూటమి. 1990ల నాటి అరాచక పాలన కారణంగా రాష్ట్రం ఇంకా సమస్యలు ఎదుర్కొంటోంది. వారి హయాంలో నేరాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలకు తెలుసు. కొత్త కారు కొనుక్కోవాలన్నా ఎక్కడ తమను కిడ్నాప్ చేస్తారో అని ప్రజలు భయపడే వారు. ఈ తరం యువత ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే సీఎం నితీశ్​ కూమర్​కే మరోసారి అధికారమివ్వండి. ".

-ప్రధాని నరేంద్ర మోదీ.

కాంగ్రెస్ సహా వామపక్షాలు భాగస్వాములుగా ఉన్న మహాకూటమి నక్సలిజాన్ని పోత్సహిస్తుందని ధ్వజమెత్తారు మోదీ. వారి రాజకీయ అస్తిత్వం కోసం ప్రజల్ని ఎప్పుడూ పేదలుగా ఉంచాలనే ఆ పార్టీలు భావిస్తాయని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.