బిహార్లో 'మోదీ మంత్రం' ఫలించింది. మరోసారి నితీశ్ మార్క్ పాలనకే రాష్ట్రం జై కొట్టింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని కట్టబెట్టింది ప్రజానీకం. ఆ కూటమికి 125 స్థానాలు లభించగా, గట్టి పోటీనిచ్చిన మహాకూటమి 110 స్థానాల వద్ద ఆగిపోయింది.
బిహార్ శాసనసభ సమరంలో సాధించిన విజయం కమలనాథులకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది. రాబోయే ఎన్నికలకు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందించింది.
అయితే బిహార్ ఎన్నికలు జరిగిన తీరు, ఓటింగ్ నుంచి కౌంటింగ్ వరకు ఉన్న ముఖ్యాంశాలను చూద్దాం..