ETV Bharat / bharat

బిహార్​ బరి: మోదీ సర్కార్​ విజయాలే.. భాజపా ప్రచారాస్త్రాలు! - యోగి ఆదిత్యనాథ్

బిహార్​ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. పాట్నా పీఠం దక్కించుకోవటమే లక్ష్యంగా సాగుతున్న పోరులో.. అన్ని పక్షాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార కూటమిలో కీలక పక్షంగా ఉన్న.. భాజపా వ్యూహాలకు పదును పెంచింది. కేంద్రంలోని మోదీ సర్కార్​ విజయాలనే ముందుపెట్టి.. బరిలోకి దిగింది.

pm demand in bihar election
బిహార్​ బరి: మోదీ సర్కార్​ విజయాలే.. భాజపా ప్రచార అస్తాలు
author img

By

Published : Oct 17, 2020, 5:36 PM IST

బిహార్​లో మరోసారి​ అధికార పక్షంలో ఉండటమే లక్ష్యంగా.. భాజపా ముందుకువెళ్తోంది. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన వేళ.. ఇక ప్రచారంపైనే దృష్టి సారించింది. మోదీ బొమ్మ ముందుపెట్టి ఓట్లు అడగాలని ప్రణాళికలు రచించింది కాషాయ దళం. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ప్రచారంలోనూ మోదీ ప్రభుత్వం విజయాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతోంది. కేంద్రం ఘనతలను చూపించి ఓట్లేయాలని బిహార్​ ప్రజలను కోరుతోంది కమల దళం.

కేంద్ర పథకాలు..

లాక్​డౌన్​లో కేంద్రం తీసుకొచ్చిన 'ఆత్మనిర్భర్​ భారత్​' ప్యాకేజీపై ప్రత్యేక దృష్టి సారించి.. విస్తృతంగా ప్రచారం చేస్తోంది భాజపా. రాష్ట్రంలో నితీశ్​ కుమార్​ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని భావించిన భాజపా.. పూర్తిగా కేంద్రం తెచ్చిన పథకాలు, ఇచ్చిన ప్యాకేజీలపైనే ఆధారపడాలని నిర్ణయించుకుంది.

370 అధికరణం రద్దు, సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ మరణం వంటి అంశాలపై పార్టీ గళమెత్తినా.. పెద్దగా ప్రభావం లేదని భావిస్తున్నారు కమలం నేతలు. అందుకే, ప్రచార పంథా మార్చుకోవాలన్న ఆలోచనకు వచ్చారు.

ఇదీ చూడండి: బిహార్​ భాజపా ఆశలు మోదీ బొమ్మపైనే!

పార్టీ దిశానిర్దేశం..

రాష్ట్రంలోని కార్యకర్తలకు ఇప్పటికే పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ప్రధాని విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా వారికి సూచనలు చేసింది. మరోవైపు బిహార్​ ప్రచార గోదాలో.. వర్చువల్​ ర్యాలీలతో భాజపా అందరికంటే ముందుంది. భాజపా శ్రేణులు ఇప్పటికే తమ ప్రచారాన్ని మండల స్థాయికి తీసుకెళ్లారు. కరోనా కట్టడితో పాటు ఇతర అంశాలపై కేంద్ర స్థాయిలో మోదీ సర్కార్​ చేస్తున్న కృషి గురించి ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో.. చైనా-భారత్ సరహద్దు వివాదాలను సైతం ప్రచార పర్వంలో ముందుంచారు. బిహార్​ అభ్యున్నతికి కేంద్రం ఎంతగానో కృషి చేస్తుందని చెబుతున్నారు.

ప్రాజెక్టులకు శంకుస్థాపన

ప్రధాని మోదీ ఇప్పటికే.. బిహార్​లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. లాక్​డౌన్​లో స్వస్థలాలకు తిరిగొచ్చిన వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక మద్దతు కల్పించేలా.. తాజాగా 50,000కోట్లతో ఉపాధి పథకాన్ని మోదీ-నితీశ్​లు సంయుక్తంగా ప్రారంభించారు. అలాగే, బిహార్​లో కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి విస్తృతంగా ప్రజలకు వివరిస్తున్నారు. ప్రధాని శ్రమ ఫలాలు దక్కాలంటే.. నితీశ్​ను మరోసారి గెలిపించాలని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు.

ప్రచార దళం

ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించేందుకు పార్టీ అన్నివిధాలుగా సన్నద్ధమైంది. మోదీతో పాటు.. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్​, ​స్మృతి ఇరానీ బిహార్​ ప్రచారంలో పాల్గొననున్నారు. కరోనా కారణంగా నిర్వహిస్తోన్న వర్చువల్​ ర్యాలీలను వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు చేరవేసేలా.. భాజపాలోని 4లక్షల మంది కార్యకర్తలకు స్మార్ట్​ఫోన్లు ఇస్తోంది పార్టీ. 10,000మంది సోషల్​ మీడియా కమాండోలను నియమించింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. నియోజకవర్గాల్లోనూ, మైదానాల వద్ద మోదీ ప్రసంగాలను ప్రసారం చేసేందుకు భారీ తెరలను ఏర్పాటు చేయనున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే సభలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా మోదీ విజయాలతోనే పార్టీ బిహార్​లో జయకేతనం ఎగురవేస్తుందని భాజపా శ్రేణులు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి: బిహార్​ బరి: 12 బహిరంగ సభల్లో మోదీ ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.