51 శాతం పైనే నమోదు..
బిహార్ ఎన్నికల సమరంలో తొలిదఫా పోలింగ్ పూర్తయింది. మొదటి దశలో భాగంగా 71 స్థానాలకు ఓటింగ్ జరిగింది. 243 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 52.24 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పించారు. తొలిదశలో దాదాపు 1,066 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.