బిహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్రంలోని 243 నియోజకవర్గాలకు 3 దశల్లో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 28న తొలి దశ పోలింగ్ జరగనుండగా... అన్ని దశల ఓట్ల లెక్కింపు నవంబర్ 10న జరగనుంది.
తొలి దశ:
- 16 జిల్లాల్లోని 71 స్థానాలకు పోలింగ్
- 31 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
- అక్టోబర్ 1న నోటిఫికేషన్ జారీ
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8
- పోలింగ్ తేదీ అక్టోబర్ 28
రెండో దశ:
- 17 జిల్లాల్లోని 94 స్థానాలకు ఓటింగ్
- 42 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
- పోలింగ్ తేదీ నవంబర్ 3
మూడో దశ:
- 15 జిల్లాల్లోని 78 స్థానాలకు పోలింగ్
- 33.5 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
- అక్టోబర్ 13న నోటిఫికేషన్ జారీ
- పోలింగ్ తేదీ నవంబర్ 7
అన్ని దశలకు కలిపి నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.