కేన్సర్‌తో బాధపడుతున్న తండ్రి, ఆయనతో తరచూ గొడవపడే తల్లి.. వీరిద్దరి మధ్య తాను నలిగిపోతున్నానని ఆవేదన చెందాడు ఓ 15 ఏళ్ల బాలుడు. తనకు స్వచ్ఛందంగా మరణించడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని కోరాడు.
ఈ లేఖను రాష్ట్రపతి కార్యాలయం ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపింది. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కార్యాలయం బిహార్‌లోని భాగల్‌పుర్ జిల్లా అధికారులను ఆదేశించింది. బాలుడి తండ్రి ప్రభుత్వాధికారి. తల్లి పట్నాలో ఓ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆ బాలుడు రెండు నెలల క్రితం రాష్ట్రపతికి లేఖ రాశాడు. కేన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రిని అసాంఘిక శక్తులతో తన తల్లి బెదిరింపులకు గురిచేస్తోందని లేఖలో తెలిపాడు. ఇవన్నీ చూసి తట్టుకోలేక చనిపోవాలనుకుంటున్నానని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: చిన్నారి బతకదన్నారు.. కానీ జయించింది!