గతేడాది జనవరిలో జరిగిన భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో నిందితుడు ప్రొఫెసర్ ఆనంద్ టెల్టుంబ్డేని అరెస్టు చేశారు పుణె పోలీసులు.
గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఫ్యాకల్టీగా ఆనంద్ పని చేస్తున్నారు. భీమా కోరేగావ్ పోరాటానికి 200 ఏళ్లు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఎల్గర్ పరిషత్ కార్యక్రమంలో హింసకు కారణమయ్యరన్న ఆరోపణలపై ఆయన అరెస్టు చేశారు. మావోయిస్టులతోనూ ఆనంద్‌కు సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు పోలీసులు.
బెయిల్‌కు నిరాకరణ
ఆనంద్‌కు ముందస్తు బెయిల్ మంజూరుకు పుణెలోని ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ఎల్గర్ పరిషత్ అల్లర్లలో జరిగిన హింసలో ఆనంద్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు అదనపు సెషన్స్ కోర్టు జడ్జి కిషోర్ వందనే.