ETV Bharat / bharat

'అపర చాణక్యుడు... ప్రణబ్ ముఖర్జీ దాదా'

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఇవాళ భారతరత్న పురస్కారం అందుకున్నారు. అపర చాణక్యునిగా పేరుగాంచిన ఆయన కాంగ్రెస్​ను అనేక సంక్షోభాల నుంచి బయటపడేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగానూ నిలిచారు. ఆ మహోన్నతుని జీవిత విశేషాలు మీకోసం.

'అపర చాణక్యుడు... ప్రణబ్ ముఖర్జీ దా'
author img

By

Published : Aug 8, 2019, 8:04 PM IST

ప్రణబ్‌ ముఖర్జీ సమకాలీన రాజనీతిజ్ఞుల్లో మేరునగధీరుడు. సంక్షోభ సమయాల్లో చిక్కుముడులను అవలీలగా విప్పే నేర్పరి. పార్లమెంటరీ వ్యవస్థను ఔపోసన పట్టిన ఈ అపర చాణుక్యుడు. ఈ మహోన్నతమూర్తిని కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది.

ప్రస్థానం

రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చవిచూసిన ప్రణబ్‌ముఖర్జీ పశ్చిమబెంగాల్‌లోని మిరాటీలో 1935 డిసెంబర్‌ 11న జన్మించారు. పొలిటికల్‌ సైన్స్‌, చరిత్రలో ఎంఏ చేసిన ఆయన కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు క్లర్క్‌గా, అధ్యాపకుడిగా, పాత్రికేయుడిగా పని చేశారు.

1969లో ఇందిరాగాంధీ హయాంలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ప్రణబ్‌. 1982లో పిన్న వయసులోనే కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏ అంశంమీదైనా అనర్గళంగా ప్రసంగించగల ప్రణబ్‌.... చాణక్యం, హాస్య చాతుర్యం, గాంభీర్యం, ఆగ్రహం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలో తెలిసిన వ్యక్తి.

పదవులకే వన్నె తెచ్చిన నేత

కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్‌ ముఖర్జీ.... ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 2012 నుంచి 2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించి ఆ పదవికే వన్నె తెచ్చారు. రాష్ట్రపతి అంటే కేవలం రబ్బరు స్టాంపు కాదని చాటిన ప్రణబ్‌ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ దేశం తరఫున గళం విన్పిస్తూ ప్రత్యేకత నిలుపుకొన్నారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్రప్రసాద్, జాకీర్‌ హుస్సేన్, వీవీ గిరిల తర్వాత భారతరత్న పొందిన రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు. 1984లో యూరో మని మేగజీన్‌ నిర్వహించిన సర్వేలో ప్రణబ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా ఎంపికయ్యారు. 1991 నుంచి 1996 వరకు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా 1987-89 మధ్య ఏఐసీసీ ఆర్థికసలహామండలి ఛైర్మన్‌గా ప్రణబ్‌ వ్యవహరించారు.

అపర చాణక్యుడు

కాంగ్రెస్‌ పార్టీలోనూ, పార్లమెంట్‌ వ్యవహారాల్లో అనేక సంక్షోభాలను పరిష్కరించి తన చాణక్యాన్ని ప్రదర్శించారు ప్రణబ్​. 2004, 2009 ప్రత్యక్ష ఎన్నికల్లో తప్పించి ప్రణబ్‌ ఎప్పుడూ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. ఇందిరాగాంధీ ఆయనకు ఎన్నో కీలక బాధ్యతలు అప్పచెప్పారు.

ఇందిరా గైర్హాజరులో మంత్రివర్గ సమావేశాలకు మిగిలిన వారి కంటే జూనియర్‌ అయిన ప్రణబ్‌కే అధ్యక్షత వహించే అవకాశం కల్పించేవారు. రాజీవ్‌గాంధీతో విభేదాల కారణంగా 1986లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ను స్థాపించిన ప్రణబ్‌ మళ్లీ కాంగ్రెస్‌ గూటికే చేరారు.

భారతరత్న

దేశ రాజకీయాల్లో అత్యున్నత ప్రమాణాలను అనుసరించిన ప్రణబ్‌కు 2008లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారం అందించింది. నేడు భారతరత్నగా నిలిచారు.

భారతరత్న పురస్కారం రావడంపై స్పందించిన ప్రణబ్‌... దేశ ప్రజలకు తాను చేసిన దానికంటే ప్రజలే తనకు ఎక్కువిచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ గొప్ప గౌరవాన్ని దేశ ప్రజల పట్ల పూర్తి కృతజ్ఞతా భావం, విధేయతతో స్వీకరిస్తున్నానని ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి: అంతర్జాతీయ ఒత్తిడితో... పసిడి ధరలకు రెక్కలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.