కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దిల్లీలో నిర్వహించాలని తలపెట్టిన ‘భారత్ బచావో’ ర్యాలీని వాయిదా వేసినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. నవంబరు 30న నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, శాసనసభాపక్షనేతలు, అనుబంధ సంస్థల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. డిసెంబరు 14వ తేదీ ఉదయం 11 గంటలకు దిల్లీలోని రామ్‌లీలా మైదానం వేదికగా జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.