ముక్కు పచ్చలారని ఓ పసిపాపకు, పర్వతమంత ఓ గజరాజుకు మధ్య స్నేహం కుదిరింది. ఆ ఇద్దరూ ఒకరిని వదిలి ఒకరు క్షణం కూడా ఉండలేరు. ఈ అపూర్వ స్నేహబంధం మాటల్లో వర్ణించలేనిది.
కేరళలోని తిరువనంతపురానికి చెందిన మహేష్‌కు ఉమాదేవి అనే ఓ ఏనుగు ఉంది. అతను దాని సంరక్షణను చూస్తూ ఉంటాడు. రెండేళ్ల అతని కుమార్తె భామ ఆరు నెలల వయస్సు నుంచే ఆ గజరాజుతో ఆడుకోవడం ప్రారంభించింది. క్రమంగా వారిద్దరి మధ్య అపూర్వ స్నేహం చిగురించింది. ఒకరిని విడిచి ఒకరు మనలేని వారి స్నేహం అపూర్వం.
ఇదీ చూడండి: మనిషిని నమ్మడమే అది చేసిన తప్పు