శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ వినియోగం కలకలం రేపిన నేపథ్యంలో.. బెంగళూరులో డ్రగ్ డీలర్లు, వాటిని వాడే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బెంగళూరు అంతటా విస్తృత సోదాలు నిర్వహించి.. ఇప్పటివరకు 61 మంది డ్రగ్ డీలర్లను అరెస్టు చేశారు. కోట్ల రూపాయలు విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో గంజాయి, అఫీమ్, బ్రౌన్ షుగర్ సహా మత్తు పదార్థాలు నింపిన మాత్రలు ఉన్నాయి. 121మంది మాదక ద్రవ్యాల వినియోగదారులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: లైవ్ వీడియో: చేతిలో కత్తితో బైక్‌పై యువత విన్యాసాలు