ETV Bharat / bharat

బంగాల్​ బరి​: 'సరస్వతీ' మంత్రం పఠిస్తున్న తృణమూల్​!

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రచార పర్వం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. కేంద్ర మంత్రులు, ప్రముఖ నేతల వరుస పర్యటనలతో భాజపా.. ప్రచారంలో కాస్త ముందుంది. కీలక నేతలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండట వల్ల తృణమూల్​ అయోమయంలో పడింది. అయితే.. వచ్చే వసంత పంచమి(సరస్వతీ పూజ) వేదికగా బంగాల్​ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయనుంది అధికార పార్టీ. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది.

Bengal: TMC leaders eyes Saraswati Puja to woo voters
బంగాల్​ దంగల్​: 'సరస్వతీ' మంత్రం పఠిస్తున్న తృణమూల్​!
author img

By

Published : Feb 7, 2021, 3:02 PM IST

ఈ ఏడాది జరగనున్న పశ్చిమ్​ బంగా అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార తృణమూల్​, ప్రధాన పోటీదారుగా భావిస్తున్న భాజపా పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులు తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ)కు తలనొప్పి తెప్పిస్తుంటే.. కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల వరుస పర్యటనలతో కమలం పార్టీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

అయితే.. ఇదంతా భాజపా ఎన్నికల గిమ్మిక్కుగా అభివర్ణిస్తున్న తృణమూల్​ నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. అదే సరస్వతీ పూజ. వసంత పంచమిగా కూడా పిలిచే ఈ పండుగను బంగాల్​ వ్యాప్తంగా ఫిబ్రవరి 16న జరుపుకోనున్నారు. ఈ వేదికగానే ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తోంది టీఎంసీ.

ఇదీ చూడండి: బంగాల్ దంగల్: నందిగ్రామ్​లో మళ్లీ ఆనాటి రక్తపాతం!

యువ ఓటర్లను ఆకర్షించేందుకే..!

బంగాల్​ సంప్రదాయాలకు తలమానికంగా నిలిచే ఈ వేడుకలను.. ప్రజలతో మమేకమయ్యేలా ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు టీఎంసీ నేతలు. ఈ ఉత్సవాల్లో ఎక్కువగా కనిపించే విద్యార్థులు, యువతను తమ వైపు తిప్పుకునేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

ఇదీ చూడండి: బంగాల్​ దంగల్: ఓవైసీ ఎంట్రీతో దీదీకి పరేషాను?

ఈ సందర్భంగానే బంగాల్​ ప్రజలు.. యుగాలుగా సరస్వతీ పూజను జరుపుకొంటున్నారని, భాజపా దీనిపై రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు తృణమూల్​ కౌన్సిలర్​ బైశ్వనార్​ ఛటోపాధ్యాయ్​. మతపరమైన విశ్వాసాలను దెబ్బకొట్టి లబ్ధి పొందాలని చూస్తుందని విమర్శిస్తున్నారు. అయితే.. ఈ వేడుకల్లో విద్యార్థులతో మాట్లాడే అవకాశం తమకు దొరుకుతుందని అన్నారు.

''బంగాల్​ ప్రజలు యుగాలుగా సరస్వతీ పూజను జరుపుకొంటున్నారు. ఇది ప్రజల మధ్య అనుబంధానికి చక్కని వేదిక. ఈ సందర్భంగా.. యువ ఓటర్లైన వేర్వేరు విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన విద్యార్థులతో మాట్లాడే అవకాశం మాకు దొరుకుతుంది. మేం.. భాజపాలా నీచ రాజకీయాలకు పాల్పడబోం. మత విశ్వాసాలను రెచ్చగొట్టి.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని కమలం పార్టీ చూస్తోంది. మేం అలా చేయం.''

- బైశ్వనార్​ ఛటోపాధ్యాయ్​, తృణమూల్​ కౌన్సిలర్​

ఇప్పుడే గుర్తొస్తాయా?

ఎన్నికల సమయంలోనే భాజపాకు పండుగలు, రాష్ట్ర ప్రముఖులు గుర్తొస్తారని ఆరోపించారు ఛటోపాధ్యాయ్​. ఎన్నికల కోసమే బంగాల్​ మహనీయుల జయంత్యుత్సవాలపై.. భాజపా ఇప్పుడు దృష్టి సారిస్తుందని మండిపడ్డారు.

తాము ఎల్లప్పుడూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని, భాజపాలా ఎన్నికల కోసమే ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ప్రచార పర్వం: భాజపా రథయాత్ర- ర్యాలీతో టీఎంసీ

'వారికి బంగాల్​ సంప్రదాయాలేం తెలియవు'

హస్తినలో ఉండే భాజపా నేతలకు బంగాల్​ సంప్రదాయాలపై కాస్తయినా అవగాహన లేదని అంటున్నారు మరో తృణమూల్​ కౌన్సిలర్​ స్వపన్​ సమద్దార్​. అయితే.. ఎన్నికలు ఉన్నందున ఈ ఏడాది సరస్వతీ పూజ తమకు మరింత భిన్నంగా ఉంటుందని అన్నారు.

''ఒక ప్రజాప్రతినిధిగా నేనెప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటా. ప్రత్యేకంగా దీని కోసం నేనేం సరస్వతీ పూజను వినియోగించుకోను. అయితే.. ఈ వేడుకలకు ఎక్కువమంది ప్రజలు వస్తారు కనుక, వారితో మాట్లాడే అవకాశం లభిస్తుంది.''

- స్వపన్​ సమద్దార్​, తృణమూల్​ కౌన్సిలర్​

ఇదీ చూడండి: పరాక్రమ్​ కాదు.. దేశ్​నాయక్​ దివస్​ ఇది: దీదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.