ETV Bharat / bharat

బంగాల్​ కేబినేట్​లో కరోనా కలకలం.. మంత్రికి వైరస్​​ - covid-19 death toll in West Bengal

పశ్చిమ బంగాల్​ రాష్ట్ర కేబినేట్​లో ఓ మంత్రికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్​లో ఉంటూ చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మరోవైపు మహారాష్ట్ర పోలీసు దళంలోనూ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 116మంది రక్షక భటులకు మహమ్మారి సోకిందని అధికారులు వెల్లడించారు.

Bengal minister tests positive for COVID-19
బంగాల్​ కెబినేట్​లో కరోనా కలకలం.. ఓ మంత్రికి వైరస్​​
author img

By

Published : May 29, 2020, 1:18 PM IST

బంగాల్​ మంత్రివర్గంలో ఓ మంత్రికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఫలితంగా ఆ రాష్ట్ర కేబినెట్​లో కొవిడ్​-19 కలకలం చెలరేగింది. ఇదే విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు. కరోనా పరీక్షా ఫలితాల్లో పాజిటివ్​ వచ్చిన వెంటనే ఆయన హోం క్వారంటైన్​లోకి వెళ్లారని పేర్కొన్నారు.

వైరస్​ లక్షణాలతో బాధపడుతున్న మంత్రి సహా ఆయన కుటుంబ సభ్యుల నమూనాలు పరీక్షించారు. అయితే మంత్రితో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్న మరొకరికి వైరస్​ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు.

బంగాల్​లో గురువారం అత్యధికంగా 344 కేసులు నమోదు కావడం వల్ల రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,536కు చేరింది. ఇప్పటివరకు 223మంది మృతి చెందారు.

116 మంది పోలీసులకు వైరస్​

మహారాష్ట్రలో మరో 116మంది పోలీసులకు వైరస్ సోకిందని, మరో ముగ్గురు వైరస్​తో చనిపోయారని పోలీసు అధికారులు తెలిపారు.​ ఇప్పటివరకు మొత్తం 2,211 మంది పోలీసులు మహమ్మారి బారిన పడగా... 25మంది చనిపోయారని ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'సరిహద్దు వివాదంలో కేంద్రం నిబద్ధత చాటుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.