ETV Bharat / bharat

బంగాల్​ వడియాలకు దశాబ్దాల చరిత్ర

పశ్చిమ్‌బంగలో తయారుచేసే వడియాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వాటిని స్థానికంగా గోయ్నా బోరీలు అంటారు. తూర్పు మేదినిపూర్‌ మహిళలు పలు కళాకృతులతో ఈ వడియాలను తయారు చేస్తారు. బంగాలీలు ప్రత్యేకంగా కార్తీకమాసంలో ఈ వంటకం తయారీని ప్రారంభిస్తారు.

bengal -historic-food-recipe-goyna bori
శతాబ్దాల చరిత్రకలిగిన 'బంగాల్ వడియాలు'
author img

By

Published : Nov 7, 2020, 1:52 PM IST

'బంగాల్ వడియాలు'

బంగాలీల నోరూరించే వంటలు, వంటల రెసిపీల ప్రత్యేకతే వేరు. అలాంటి వారి ఆహార పదార్థాల్లో ఎప్పుడో గానీ లేకుండా ఉండదు ఓ ప్రత్యేక పిండివంటకం. శంఖాకారంలో ఉండే అందమైన అలంకరణలతో తీర్చిదిద్దిన ఆ ప్రత్యేక వడియమే "గోయ్నా బోరీ”. సీతాకోక చిలుకలు, బాతులు, చిలుకలు, నెమళ్లతో పాటు చెవి రింగులు, గాజులు, చేతి కడియాలు, ఇలా ఎన్నో రూపాల్లో వాటిని తయారు చేస్తారు. విభిన్న ఆకృతుల్లో లభించే ఆ వడియాలు దశాబ్దాలుగా బంగాలీల రోజువారీ ఆహారంలో ఒకభాగంగా మారిపోయాయి.

ఈ సంప్రదాయ వంటకం తూర్పుమేదినిపూర్‌ జిల్లాకే ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ జిల్లాలోని తమ్లక్‌, మహిషాదల్, నందకుమార్‌, మోయ్నా ప్రాంత మహిళలు గోయ్నాబోరీల తయారీలో నైపుణ్యం సాధించారు.

తయారీ విధానం

బంగాలీ కార్తీకమాసంలో మినప, పెసర మరికొన్ని పప్పులు కలిపి రుబ్బి , ఆభరణాల రూపంలో మలిచి పైన గసగసాల పొర అద్దుతారు. ఈ వంటల సీజన్‌ ప్రారంభంలో పూజారుల సమక్షంలో ఆ వడియాలకు పెళ్లి లాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

"తెల్లవారు జామున 2గంటలకు నిద్రలేచి 45నిమిషాల పాటు పప్పులు నాన బెడతాం. తర్వాత ఒకరు పిండిని... మరొకరు దానికి అల్లం, జీలకర్ర, మిర్చీ, మసాలా కలుపుతారు. ఆ పని ఉదయం 6గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం వడియాల తయారీ మొదలు పెడతాం. "

---బగబతి దాస్‌, గొయ్నా బోరీ తయారీదారు

తూర్పు మేదినీపూర్‌ జిల్లాకు ప్రత్యేకమైన ఈ వంటకాన్ని పరిరక్షించేందుకు ఆ జిల్లా కలెక్టర్ పార్థఘోష్‌ చర్యలు చేపట్టారు. వాటి అమ్మకాలు పెంపొందించేందుకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగంతోనూ సంప్రదింపులు చేస్తున్నారు.

"మా జిల్లాలోని స్వయం సహాయక బృందాలు, మరికొందరు మహిళలు వీటి తయారు చేస్తుంటారు. సుఫల్‌ బంగ్లా స్టాల్స్ ద్వారా వారి వడియాల విక్రయానికి పశ్చిమ్‌బంగ వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగం సమ్మతించింది. అందుకు కావాల్సిన పత్రాలన్నీ సిద్ధం చేస్తున్నాం. అవి సిద్ధం కాగానే ప్రతిపాదనలు పంపిస్తాం. త్వరలోనే సుఫల్‌ బంగ్లా స్టాళ్ల ద్వారా గోయ్నా బోరీలను విక్రయిస్తామని అనుకుంటున్నాం. "

--పార్థ ఘోష్‌, కలెక్టర్‌, తూర్పు మేదినిపూర్‌

కనుమరుగవుతున్న వంటకం

అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా సంప్రదాయ గోయ్నాబోరీలు కనుమరుగయ్యే పరిస్థితి రావటానికి ఎన్నో కారణాలు. అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారు మాత్రం గోయ్నాబోరీలు పునర్వైభవం సాధించాలని కోరుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.