బంగాల్లోని జల్పాయ్గుడిలో మానవమృగాలు రెచ్చిపోయారు. ఓ పదహారేళ్ల బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి పాశవికంగా చంపేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ ఇంటిలోని సెప్టిక్ ట్యాంక్లో పడేశారు.
ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వీరికి 8 రోజుల పోలీసు కస్టడీని విధించింది న్యాయస్థానం. ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ జరిగింది..
జిల్లాలోని రాజ్గంజ్కు చెందిన మైనర్ బాలిక.. ఆగస్టు 10 నుంచి కనిపించకుండా పోయింది. ఈ విషయమై ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి విచారించగా బాలికను ఆగస్టు 15న అత్యాచారం చేసి చంపేసినట్లు అంగీకరించారు.
ఉరి తీయాలని డిమాండ్..
హత్యాచార ఘటనపై స్థానిక ఎమ్మెల్యే ఖగేశ్వర్ రాయ్ స్పందించారు.
"ఆగస్టు 11న పోలీసులు కేసు నమోదు చేసుకుంటే.. శవం లభించే వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ చర్యకు పాల్పడినవారిని ఉరితీయాలి." అని రాయ్ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఇంత ప్రేమ నాకొద్దు బాబోయ్.. విడాకులిప్పించండి ప్లీజ్!