వర్షాకాలం మొదలై ఇప్పటికి రెండు నెలలు పూర్తి కావస్తోంది. అయినా దేశంలోని 100 ప్రధాన జలాశయాల్లో 72 చోట్ల నీటి నిల్వలు సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లు కేంద్ర జల సంఘం వెల్లడించింది. జులై 25 వరకు నమోదైన గణాంకాలను బట్టి దేశంలోని ప్రధాన నదులైన గంగా, కృష్ణా, మహానదులలో నీటి నిల్వ స్థాయి తక్కువగా ఉన్నట్లు తెలిపింది.
సాధారణంగా వర్షాకాలం జూన్‌లో ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే సగం సీజన్ ముగిసింది. కొన్ని రాష్ట్రాలు భారీ వర్షాలకు తడిసి ముద్దవుతుంటే... కొన్ని ప్రాంతాల్లో మాత్రం నీటి ఎద్దడి కొనసాగుతోంది. మహారాష్ట్ర, గుజరాత్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. తపతి, సబర్మతి పాటు కచ్, గోదావరి నదుల్లో అత్యంత తక్కువ నీటి నిల్వలు ఉన్నాయి.
వర్షపాతం అంతంతే...
భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డీ) పరిధిలోని 36 వాతావరణ ఉపవిభాగాలలో 18 చోట్ల సాధారణం కంటే తక్కువగా, 15 చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది.
ఇదీ చూడండి:మధ్యప్రదేశ్‌లో నీటమునిగిన వందల ఇళ్లు