ETV Bharat / bharat

పీకే మరో సూపర్​ హిట్​- ఆప్​ విజయం వెనుక ఐప్యాక్​ - who is prashant kishor

ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీలో మూడోసారి అధికార పీఠం కైవసం చేసుకుంది. ఎన్నికల్లో ప్రాంతీయ, జాతీయ అంశాల ప్రభావం ఎలాగున్నా.. ఆప్​ విజయంలో తెరవెనకున్న మరో హస్తం ఐ-ప్యాక్. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఈ సంస్థ ప్రభావం ప్రత్యక్షంగా కనిపించకపోయినా.. ఆప్​ అమలుచేసిన ప్రతి వ్యూహంలో భాగస్వామి అయింది.

Prashant Kishor
ప్రశాంత్ కిశోర్
author img

By

Published : Feb 11, 2020, 5:46 PM IST

Updated : Mar 1, 2020, 12:21 AM IST

ఐ-ప్యాక్... ఇండియన్​ పొలిటికల్​ యాక్షన్​ కమిటీ. ఓ ప్రైవేటు సంస్థ. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... ఆ సంస్థకు యజమాని. దిల్లీ శాసనసభ ఎన్నికల వేళ ఆ సంస్థ మరోమారు చర్చనీయాంశమైంది. హస్తినలో ఆమ్​ఆద్మీ పార్టీ మరోమారు అసాధారణ విజయం సాధించడంలో ఐ-ప్యాక్​ పాత్ర కూడా ఉండడమే ఇందుకు కారణం.

తెరవెనుక వ్యూహాలతో...

ఓ వైపు జాతీయ సమస్యలు, దేశ భద్రత, పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలతో ప్రధాన ప్రత్యర్థి భాజపా బరిలోకి దిగుతుంటే... స్థానిక అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతోనే ఆమ్ ఆద్మీ తన ప్రచారాన్ని సాగించింది.

ఆప్​ ప్రచారాన్ని సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు విస్తృతంగా పనిచేసింది ప్రశాంత్ కిశోర్​ నేతృత్వంలోని ఐ-ప్యాక్. ప్రచార నినాదాలు, ఏ ప్రాంతంలో ఏ అంశాలపై దృష్టిపెట్టాలి, డిజిటల్ ప్రచారం ఎలా సాగాలి వంటి విషయాల్లో కీలక సూచనలు చేసింది. ఐ-ప్యాక్​ సలహాలు పాటిస్తూ... అభివృద్ధి-సంక్షేమ మంత్రంతో కేజ్రీ సేన సాగించిన ప్రచారం... ఆప్​కు మరోమారు అఖండ విజయాన్ని కట్టబెట్టింది.

Prashant Kishor
ప్రశాంత్ కిశోర్​తో కేజ్రీవాల్

అప్పుడు ప్రత్యర్థులు..

ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసింది ఐ-ప్యాక్. కానీ... ఒకానొక సమయంలో ఇద్దరూ ప్రత్యర్థులుగానూ తలపడ్డారు. 2017లో పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్​ పోటీ చేస్తున్న సమయంలో ఐ-ప్యాక్ కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పటివరకు తాము ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన ప్రత్యర్థులలో ఆమ్ ఆద్మీ ఒకటని ఈ మధ్యే అన్నారు ప్రశాంత్ కిశోర్.

ఏమిటీ ఐ-ప్యాక్?

ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు తగినట్లు రాజకీయ వ్యూహాలు రచించే సంస్థగా ఐ-ప్యాక్​కు మంచి పేరుంది. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలకు సలహాలు, సూచనలు అందిస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ సంస్థ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోంది. 2014 సార్వత్రికంలో నరేంద్రమోదీ ప్రచార సరళిని ఈ సంస్థే రూపొందించింది. 2015 బిహార్​ ఎన్నికల్లో నితీశ్ కుమార్, 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్​మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు కావడంలో ముఖ్య పాత్ర పోషించింది.

వైవిధ్యభరితం

తక్కువ ఖర్చుతో వైవిధ్యభరితమైన ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఐ-ప్యాక్ ప్రత్యేకత. వ్యక్తిగత గుర్తింపు ఇవ్వడం సహా విషయాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐ-ప్యాక్ అన్నివిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో 'చాయ్​ పే చర్చా' కార్యక్రమం ఎలాంటి ప్రభావం చూపిందో తెలియంది కాదు. భాజపా తరపున ప్రధాన మంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్న నరేంద్రమోదీకి వ్యక్తిగత ప్రాచుర్యం కల్పించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది. గతంలో టీ అమ్ముకున్న ఓ సాధారణ వ్యక్తి దేశంలోనే అత్యంత శక్తివంతమైన పదవిని అధిరోహించాడనికి పోటీ పడుతున్నాడన్న భావన ప్రజల్లో కలగజేయడంలో సఫలమైంది. ఈ కార్యక్రమానికి నిర్వహణ ఖర్చు కేవలం రూ.3.5 కోట్లే కావడం గమనార్హం.

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్ సింగ్​కు గుర్తింపు తేవడానికి చేపట్టిన కాఫీ విత్ కెప్టెన్, పంజాబ్ డ కెప్టెన్ వంటి కార్యక్రమాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయ బాటలు పరిచాయి.

నిరంతర పరిశోధనే

ఈ విజయాలన్నీ సాధించడానికి కారణాం మాత్రం నిరంతర పరిశోధనే అని చెబుతారు ఐ-ప్యాక్ సంస్థ ప్రతినిధులు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకొని, బూత్ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ పార్టీ అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడతారు. అయితే తుది ఫలితం మాత్రం పార్టీ నేతలు, రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుందని వినయంగా చెబుతారు.

అన్ని రాష్ట్రాల్లోని ప్రతి నియోజక వర్గంలో తమ ప్రతినిధులను నియమించుకుంటుంది ఐ-ప్యాక్. వారి ద్వారా నియోజకవర్గాల్లోని సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు సూచిస్తుంది.

ముందుంది బంగాల్​

దిల్లీ ఎన్నికల్లో విజయంతో ఐ-ప్యాక్ సంస్థకు మంచి ప్రోత్సాహం లభించినట్లే. త్వరలో బంగాల్​లో జరగపోయే ఎన్నికల్లో అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ తరపున పనిచేయనుంది. ఇప్పటికే ఆ పార్టీతో జట్టు కట్టిన ఐ-ప్యాక్ 2021లో జరిగే ఎన్నికలకు వ్యూహ రచన ప్రారంభించింది. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేక హెల్ప్​లైన్​, వెబ్​సైట్​లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో పాటు వెయ్యి మంది పార్టీ నేతలతో 100 రోజుల వ్యవధిలో 10 వేల గ్రామాలు సందర్శిచేలా ప్రణాళికలు రూపొందించింది.

అయితే ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఐ-ప్యాక్ వ్యూహాలు గెలిపిస్తాయా? ఐ-ప్యాక్ విజయపరంపర కొనసాగుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం వచ్చే ఏడాదే తెలుస్తుంది.

ఇదీ చదవండి: దిల్లీ తీర్పు: ప్రచారంలో భాజపా జోరు.. ఫలితాల్లో బేజారు

Last Updated : Mar 1, 2020, 12:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.