ETV Bharat / bharat

బిహార్​ బరి: రాజకీయ వేడి పెంచుతోన్న 'ఎల్​జేపీ' లేఖ

బిహార్​లో అధికార ఎన్డీఏ కూటమికి సీఎం అభ్యర్థిగా కాషాయ పార్టీ నాయకుడిని ప్రకటించాలని సూచించింది లోక్​జనశక్తి పార్టీ. రాష్ట్రంలో నితీశ్​కు వ్యతిరేక గాలి వీస్తోందని, అది కూటమి ఓటమికి దారి తీసే ప్రమాదం ఉందని పేర్కొంటూ సెప్టెంబర్​ 24న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఎల్​జేపీ అధినేత చిరాగ్​ పాసవాన్​. ఆ లేఖను గురువారం విడుదల చేసింది ఎల్​జేపీ.

chirag pasawan
చిరాగ్​ పాసవాన్​
author img

By

Published : Oct 9, 2020, 5:17 AM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు.. లోక్​జనశక్తి పార్టీ రాసిన లేఖను బహిరంగపరచటం రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్​కు​ ప్రతికూల పవనాలు వీస్తున్నాయని, అది అధికార కూటమి ఓటమికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంటూ సెప్టెంబర్​ 24న నడ్డాకు లేఖ రాశారు ఎల్​జేపీ అధినేత చిరాగ్​ పాసవాన్​. ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాషాయ పార్టీ నాయకుడిని ప్రకటించాలని కోరారు​.

చిరాగ్​ పాసవాన్​ లేఖను గురువారం విడుదల చేసింది ఎల్​జేపీ. రాజ్యసభకు తన తండ్రి రామ్ విలాస్​ పాసవాన్​ను ఎన్నుకునే సమయంలో నితీశ్​ కుమార్​ అవమానపరిచారని లేఖలో పేర్కొన్నారు చిరాగ్​. అలాగే.. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు ప్రధాని మోదీ తరుచూ ఫోన్​ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారని, కానీ.. నితీశ్​ ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. సీఎం పనితీరుపట్ల చాలా మంది భాజపా నాయకులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రధాని మోదీ పాపులరిటీ పెరుగుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి విషయంలో అందుకు విరుద్ధంగా ఉందని సూచించారు.

ప్రస్తుతం ఈ లేఖను బహిరంగపరచటంపై ముఖ్య ఉద్దేశాన్ని వెల్లడించింది ఎల్​జేపీ. బిహార్​లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకురావాలనే నిర్ణయం వెనుక ఉన్న కారణాలను భాజపాకు వివరించేందుకే లేఖ రాసినట్లు తెలిపాయి పార్టీ వర్గాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను 143 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది ఎల్​జేపీ. జేడీయూ ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ స్థానంలో తాము బరిలో దిగుతామని వెల్లడించింది. కానీ, భాజపా స్థానాల్లో పోటీ చేయబోమని స్పష్టం చేసింది.

జేడీయూ నిరాకరణ..

అయితే.. ఈ లేఖ అంశంపై మాట్లాడేందుకు జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్​ సింగ్​ నిరాకరించారు. కానీ, దీనిపై పూర్తిస్థాయిలో వివరణాత్మకంగా స్పందిస్తామని ఆ పార్టీ సీనియర్​ నేత ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: ఎల్​జేపీ 'గారడీ'తో ఎవరికి నష్టం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.