కేరళలోని త్రిస్సూర్ జిల్లా వడకాన్చేరికి చెందిన మోహనన్ వృత్తిరీత్యా వడ్రంగి. తలుపులతో పాటు ఆయన బొమ్మలూ తయారు చేస్తారు. అయితే అందరిలా భూతాపం పెంచే ప్లాస్టిక్‌తో, ఇతర లోహాలతో కాకుండా వెదురు కర్రలు, వ్యర్థ పదార్థాలతో అందమైన బొమ్మలు తయారు చేయడం ఈయన ప్రత్యేకత.
వెదురుతో చేసిన కళాఖండాలు పర్యావరణ అనుకూలంగా ఉండి ప్రజల్ని ప్రకృతికి దగ్గర చేస్తాయని మోహనన్ భావిస్తారు. అందుకే ఆయన 'గీతా మోహనం' పేరిట ఓ కళాక్షేత్రం ఏర్పాటు చేశారు.
'గీతా మోహనం'లో మనకు అందమైన హస్తకళా వైభవం కనిపిస్తుంది. చేతితో తయారు చేసిన పూలకుండీలు, పక్షులు, జంతువుల బొమ్మలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. ఇక కొత్తగా రూపుదిద్దుకున్న మూడడుగుల బుద్ధుని బొమ్మలో జీవకళ ఉట్టిపడుతోంది.
"పర్యావరణహితమైన ఈ బొమ్మలు... ప్రకృతికి మనల్ని దగ్గర చేస్తాయి. ఈ బొమ్మలను తయారు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం పర్యావరణహితమైన ఈ బొమ్మలను.. నేటి తరానికి పరిచయం చేయడమే. ఈ బుద్ధుడి బొమ్మ తర్వాత.. ఇలాంటి ప్రతిమలు మరిన్ని తయారు చేయాలనుకుంటున్నాను." - మోహనన్, శిల్పి