డిస్కవరీ ఛానల్లో 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమం చూసి మీరు ఆశ్చర్యపోయే ఉంటారు. అందులో 'బేర్ గ్రిల్స్' తన జీవన విధానంలో భాగంగా వివిధ రకాల అటవీ జంతువులను ప్రాణాలతో ఉన్నప్పుడే తింటాడు. గ్రిల్స్ సాహస యాత్రతో ప్రేరణ పొందిన ఓ యువకుడు చుట్టుపక్కల దొరికే బల్లులు, కీటకాలను తింటూ అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు. ఆ కథేంటో తెలుసుకుందాం పదండీ...
అసోం డిబ్రూగఢ్ జిల్లా దులియాజాన్ గ్రామానికి చెందిన రాజేశ్ తాటి అనే 35 ఏళ్ల యువకుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. చుట్టుపక్కల ఇళ్లలో ఉండే బల్లులు, తొండలు, కీటకాలను ప్రాణాలతోనే తింటున్నాడు. తనకు డిస్కవరీ ఛానల్లో వచ్చే బేర్ గ్రిల్స్ ప్రేరణ అని చెబుతున్నాడు. భవిష్యత్తులో ప్రాణాలతో ఉన్న పాములనూ తినేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాడీ యువకుడు.
"నేను బేర్ గ్రిల్స్ వల్లే ప్రేరణ పొందాను. డిస్కవరీ ఛానల్లో ఆయన కార్యక్రమం చూసిన అనంతరం.. గత ఐదేళ్లుగా అదే అనుసరిస్తున్నాను. ఇలా చేస్తున్నందుకు నాకిప్పటివరకూ ఎలాంటి ప్రమాదం కలగలేదు."
- రాజేశ్ తాటి, అసోం.