భాజపాను జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ రెండోసారి మోసం చేస్తారని హెచ్చరించారు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినేత ఉపేంద్ర కుశ్వాహా. త్వరలోనే ఇది జరుగుతుందని జోస్యం చెప్పారు. బిహార్ పట్నాలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు కుశ్వాహా.
నమ్మక ద్రోహం చేయటం, కూటమి పక్షాలను మోసగించడం నితీశ్‌కు అలవాటేనని విమర్శించారు కుశ్వాహా. ఆయన చేతిలో మోసపోని వారు ఎవరూ లేరన్నారు. భాజపా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ భాగస్వామ్యం కాకపోవడంపై ఛలోక్తులు విసిరారు కుశ్వాహా. బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎం కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'ఎన్డీఏ- నితీశ్‌కు మధ్య ఇబ్బందులు లేవు'