ETV Bharat / bharat

'త్రీ గ్రేడ్' వ్యూహంతో బిహార్​ పోరుకు ఓవైసీ - Bihar

బిహార్​ రాజకీయంలో ముస్లింలు, యాదవులు సహా ఇతర మైనార్టీల పాత్ర ఎప్పుడూ కీలకమే. అందుకే శాసనసభ ఎన్నికల వేళ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు ఏఐఎమ్​ఐఎమ్​ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ. 32 స్థానాలపై ప్రత్యేకంగా గురిపెట్టి... ప్రధాన పార్టీలకు సవాలు విసురుతున్నారు.

banking
బిహార్​పై కన్నేసిన ఓవైసీ- మైనార్టీ ఓట్లే లక్ష్యంగా పావులు!
author img

By

Published : Sep 1, 2020, 6:25 PM IST

పట్నా పీఠం ఎవరిది? భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి అధికారం నిలబెట్టుకుంటుందా? ఆర్​జేడీ-కాంగ్రెస్​తో కూడిన మహాకూటమి ఏమైనా మార్పు తెస్తుందా?... బిహార్​ శాసనసభ ఎన్నికలకు ముందు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన ప్రశ్నలివి. ఇలా ప్రధాన కూటములు, పార్టీల చుట్టూ తిరుగుతున్న పట్నా రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎమ్​ఐఎమ్).

పక్కా స్కెచ్..

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జూన్​లోనే ప్రకటించారు ఓవైసీ. మొత్తం 32 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని సీమాంచల్​పై ఓవైసీ దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రీయ జనతాదళ్​ (ఆర్​జేడీ), కాంగ్రెస్​ బలంగా ఉన్న ప్రాంతాల్లో గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్నారు​. ముస్లింలు అత్యధికంగా ఉన్న అరారియా, క్రిష్ణగంజ్​, పూర్ణియా, కటిహర్ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ఓవైసీ.

గ్రేడ్లుగా...

ముస్లిం జనాభా ప్రాతిపదికన సీట్లను విభజించింది ఏఐఎమ్​ఐఎమ్. ఏ-ప్లస్, ఏ, బీ గ్రేడ్లుగా వర్గీకరించింది.

ముస్లిం ఓటర్లు 32 శాతంగా ఉన్న నియోజకవర్గాలను ఏ- ప్లస్​గా, 20-32 శాతం ఉన్నవాటిని ఏ గ్రేడ్​గా, 15-20 శాతం ఉన్న వాటిని బీ గ్రేడ్​గా విభజించారు. బీ గ్రేడ్ సీట్లు మొత్తం 16 ఉన్నాయి.

గట్టి పోటీ...

  • 2019 అసెంబ్లీ ఉపఎన్నికల్లో క్రిష్ణగంజ్​ స్థానాన్ని మజ్లిస్​ పార్టీ అభ్యర్థి కామ్రుల్ హొడా గెలిచారు. బిహార్​లో ఇదే మజ్లిస్​ తొలి విజయం.
  • 2019 లోక్​సభ ఎన్నికల్లో ఏఐఎమ్​ఐఎమ్​ అభ్యర్థి అఖ్తరుల్ ఇమాన్​.. ప్రస్తుత కాంగ్రెస్​ ఎంపీ మహ్మద్​ జావేద్​కు గట్టి పోటీ ఇచ్చారు.
  • 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 6 స్థానాల్లో మజ్లిస్​ పార్టీ పోటీ చేసినా గెలుపు దక్కలేదు.

సీమాంచల్​ ప్రాంతంలో పార్టీ ప్రాబల్యం పెద్దగా లేకపోయినా లౌకిక, మైనార్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రంలో పార్టీని ఓవైసీ మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.