ETV Bharat / bharat

హఫీజ్​ సయీద్​ బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ - పాక్​ ప్రభుత్వం

bank-accounts-of-hafiz-saeed-and-jud-leaders-restored
హఫీజ్​ సయీద్​ బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ
author img

By

Published : Jul 12, 2020, 2:20 PM IST

Updated : Jul 13, 2020, 8:02 AM IST

22:46 July 12

2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్​ దవా (జేయూడీ) అధినేత హఫీజ్​ సయీద్​ బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించారు పాక్ అధికారులు. అతనితో పాటు మరో నలుగురివి కూడా పునరుద్ధరించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్ సలామ్ భుట్టావి, హాజీ ఎం అష్రఫ్, యహ్యా ముజాహిద్, జాఫర్ ఇక్బాల్ అకౌంట్లను కూడా పునరుద్ధరించింది. వీరంతా ఉగ్రవాదులకు డబ్బు చేరవేసిన కేసులో లాహోర్​ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెందిన కమిటీ ఆమోదం తర్వాతే వీరి బ్యాంక్​ ఖాతాలను పునరుద్ధరించినట్లు స్ధానిక మీడియా తెలిపింది.  

తమ కుటుంబ పరిస్థితులు సరిగాలేనందు సయిద్​ బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ఐరాసకు జేయూడీ నాయకులు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఖాతా నెంబరు, ఆదాయం వచ్చే మార్గాలు, ఇతర వివరాలను పూర్తి స్థాయిలో లేఖలో పొందుపరిచినట్లు మీడియా తెలిపింది.

2008లో సయీద్​ నేతృత్వంలోని లష్కరే తోయిబా సంస్థ ముంబయిలో జరిపిన ఉగ్రదాడి కారణంగా 166 మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. దీంతో అమెరికా ట్రెజరీ విభాగం సయీద్​​ను 2008 డిసెంబర్​లో​ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

14:14 July 12

హఫీజ్​ సయీద్​ బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ

2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్​ దవా (జేయూడీ) అధినేత హఫీజ్​ సయీద్​ బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించారు పాక్ అధికారులు. ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగాలపై హఫీజ్​ను గతేడాది జులై 17న పాక్ పోలీసులు అరెస్టు చేశారు. 

Last Updated : Jul 13, 2020, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.