కర్ణాటక, బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వినూత్న చర్యలకు దిగి అబాసుపాలైంది. ఓ కరోనా కేసు నమోదైందని రెండు ఇళ్లకు స్టీల్ రేకులతో సీల్ వేసింది.
బెంగళూరులోని దొమ్మలూర్ ప్రాంతంలో ఓ భవనంలో కరోనా కేసు నమోదైంది. దీంతో అధికారులు ఆ భవనంలోని రెండు కుటుంబాలను హోమ్ క్వారంటైన్లో ఉండమని హెచ్చరించారు. అంతటితో ఆగక, వారు బయటికి రాకుండా ఉండేలా తలుపులను ఉక్కు రేకులతో మూసేశారు. ఓ మహిళతో పాటు ఇద్దరు పిల్లలు, వృద్ధ దంపతులు ఉన్న ఇంటిని ఇలా బంధించడమేంటంటూ ట్వీట్ చేసింది ఆ మహిళ. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఉక్కు సీల్‌ను తీసేశారు.
ఇదీ చదవండి: ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం