ఉత్తర్ప్రదేశ్ బలరాంపుర్ జిల్లాలో అత్యాచారానికి గురై, ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. బాధితురాలు కుటుంబానికి ఓ ప్లాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనుంది. ఈ మేరకు బాధితురాలు కుటుంబాన్ని కలిసిన స్థానిక ఎమ్మెల్యే పాల్తురామ్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే ఆ కుటుంబానికి రూ. 6,18,750 ఆర్థిక సాయం చేయగా.. మరో రూ.2 లక్షల అందజేయనున్నట్లు తెలిపారు. ఈ అమానవీయ ఘటనకు పాల్పడిన వారికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
ఇదీ జరిగింది..
కళాశాలలో అడ్మిషన్ కోసం వెళ్లిన 22ఏళ్ల యువతిని కొందరు దుండగులు అపహరించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: యూపీలో ఘోరం.. మరో రెండు 'నిర్భయ' ఘటనలు