ETV Bharat / bharat

ఎన్​కౌంటర్​లో ఇద్దరు 'దూబే' అనుచరులు హతం - కార్తికేయ అలియాస్​ ప్రభాత్ మిశ్రా ఎన్​కౌంటర్​

encounter
ఎన్​కౌంటర్​లో ఇద్దరు 'దూబే' అనుచరులు హతం
author img

By

Published : Jul 9, 2020, 8:42 AM IST

Updated : Jul 9, 2020, 10:13 AM IST

09:25 July 09

ఎన్​కౌంటర్​లో ఇద్దరు 'దూబే' అనుచరులు హతం

కాన్పూర్, ఎటావాలో గురువారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో వాంటెడ్ గ్యాంగ్​స్టర్​ వికాస్ దూబే అనుచరులు ఇద్దరు హతమయ్యారు.  

పోలీసులు వికాస్ దూబే అనుచరుడు కార్తికేయ అలియాస్​ ప్రభాత్ మిశ్రాను బుధవారం అరెస్టు చేశారు. ఫరీదాబాద్ జిల్లా కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది. అయితే అతను పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీనితో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపగా, అతను మృతిచెందాడు.  

వికాస్ దూబే మరో అనుచరుడు ప్రవీణ్​ అలియాస్​ బహువా దూబేను కూడా పోలీసులు ఎన్​కౌంటర్ చేశారు.

సంచలనం

పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీషీటర్​ వికాస్‌ దూబేను కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే  నిందితుడు,అతని అనుచరులు పోలీసులపైనే కాల్పులు జరిపి.. 8 మందిని బలిగొన్నారు. ఈ ఘటనలో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్‌ దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో వికాస్‌ దూబే ప్రధాన అనుచరుడు అమర్​ దూబేని ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు హతమార్చారు. మరో నిందితుడు శ్యాము బాజ్‌పాయ్‌ను అరెస్టు చేశారు.

08:29 July 09

కాన్పూర్​ ఎన్​కౌంటర్​లో ప్రధాన నిందితుడు, రౌడీషీటర్​ వికాస్​ దూబే అనుచరులు ఇద్దరిని ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారు. 

నిందితులు ప్రభాత్ మిశ్రా, బహువా దూబే పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు పోలీసులపై కాల్పులు కూడా జరిపారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. వారిరువురూ మృతి చెందారు. నిందితులు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వికాస్​ దూబే కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Last Updated : Jul 9, 2020, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.