ETV Bharat / bharat

శీతాకాల ఆగమనం.. చార్​ధామ్​ యాత్ర సమాప్తం - కేదార్‌నాథ్‌

ఈ ఏడాదిలో.. ప్రసిద్ధ చార్​ధామ్​ యాత్ర ఇక ముగిసింది. బద్రీనాథ్​ ఆలయ ద్వరాలను గురువారం మూసివేయగా.. ఈ క్రతువు పూర్తయింది. ఈ యాత్ర కోసం ఉత్తరాఖండ్​కు ఈసారి 3 లక్షలకు పైగా భక్తులు విచ్చేసినట్లు అధికారులు తెలిపారు.

Badrinath temple closes for winter, chardham yatra ends
శీతాకాల ఆగమనం.. ఛార్​ధామ్​ యాత్ర సమాప్తం
author img

By

Published : Nov 19, 2020, 9:11 PM IST

శీతాకాలం మొదలైన వేళ.. ప్రసిద్ధ చార్‌ధామ్ యాత్ర గురువారంతో ముగిసింది. ఉత్తరాఖండ్‌లో ఉన్న బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌ను చార్‌ధామ్‌ అని పిలుస్తారు. హిమాలయాల్లో కొలువైన..కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఇప్పటికే మూసివేయగా బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలను గురువారం మూసివేశారు. సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన పూజారి ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి.. గురువారం మధ్యాహ్నం 3:35 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు.

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది. ఈసారి 1.45 లక్షల మందికి పైగా భక్తులు బద్రీనాథ్‌ను సందర్శించుకున్నట్లు గర్వాల్ కమిషనర్, చార్‌ధామ్ దేవస్థానం బోర్టు సీఈఓ రవినాథ్‌ రామన్‌ తెలిపారు. చార్‌ధామ్ యాత్ర కోసం 3.10 లక్షల మంది భక్తులు ఉత్తరాఖండ్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది రోజువారీ దర్శనాలపై పరిమితి విధించిన అధికారులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం సహా పలు నిబంధనలు తప్పనిసరి చేశారు.

ఇదీ చూడండి:'అయోధ్య' కోసం రాజస్థాన్ సర్కార్​ మైనింగ్​ అనుమతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.