ETV Bharat / bharat

కేజ్రీవాల్​ ప్రమాణస్వీకారానికి 'బుల్లి కేజ్రీవాల్​' - Ramlila Ground here on February 16.

అచ్చం కేజ్రీవాల్​ లాగా దుస్తులు ధరించి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన బుల్లి మఫ్లర్​మ్యాన్​ ఆవ్యాన్ ​తోమర్​ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అథితిగా విచ్చేయనున్నాడు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తోమర్​కు ఆహ్వానం పంపినట్లు ఆమ్​ ఆద్మీ​ పార్టీ వర్గాలు తెలిపాయి.

baby-mufflerman-special-invitee-at-kejriwals-oath-taking-ceremony
కేజ్రీవాల్​ ప్రమాణస్వీకారానికి 'బుల్లి కేజ్రీవాల్​'
author img

By

Published : Feb 13, 2020, 6:59 PM IST

Updated : Mar 1, 2020, 5:59 AM IST

ఆమ్​ ఆద్మీ పార్టీ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​ లాగే దుస్తులు, కళ్ళజోడు ధరించి వార్తాల్లో నిలిచిన బుల్లి మఫ్లర్​మ్యాన్.. ఆవ్యాన్​ తోమర్​కు ప్రత్యేక ఆహ్వానం అందింది​. ఫిబ్రవరి 16న జరిగే అరవింద్​ కేజ్రీవాల్​ ప్రమాణ స్వీకారోత్సవంలో.. తళుక్కువ మెరవనున్నాడు ఈ బుడతడు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆవ్యాన్​ను ఆహ్వానించినట్లు ఆప్ పార్టీ వర్గాలు తెలిపాయి. దిల్లీ ముఖ్యమంత్రిగా రాంలీలా మైదానంలో మూడోసారి ప్రమాణం చేయనున్నారు కేజ్రీవాల్​.

తోమర్ ఎవరు​​?

తూర్పు దిల్లీలోని మయూర్​ విహార్​ ప్రాంతంలో నివసించే ఆవ్యాన్​ తోమర్​ ఆప్​ కార్యలయం వద్ద అరవింద్​ కేజ్రీవాల్​లాగా దుస్తులు, కళ్ళజోడు, పార్టీ టోపీ ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాకుండా ఆప్​ కన్వీనర్​లాగా మీసాలను కూడా పెట్టుకున్నాడు. ఈ వేషధారణలో చూడటానికి అచ్చం కేజ్రీవాల్​గా కనిపిస్తూ.. దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించాడు.

ఇదీ చూడండి: భారత పర్యటనపై మెలానియా ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Last Updated : Mar 1, 2020, 5:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.