దిల్లీ నుంచి బెంగళూరుకి వెళ్తున్న ఓ మహిళ విమానంలోనే ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మహిళకు నెలలు నిండక ముందే కాన్పు జరిగినట్లు ఇండిగో విమాన అధికార వర్గాలు తెలిపాయి. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
బెంగళూరు విమానాశ్రయంలో దిగిన తల్లీబిడ్డకు ఘనస్వాగతం పలికారు సిబ్బంది. బుధవారం రోజు ఈ సంఘటన జరిగింది.