ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు వినూత్న రీతిలో విరాళాల సేకరణ చేపడతామని ప్రకటించారు తమిళ రైతు సంఘం నేత అయ్యకన్ను. వారణాసి వీధుల్లో అఘోరాల వేషంలో భిక్షాటన చేస్తామన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే 111 మంది తమిళ రైతులు మోదీ పోటీ చేసే వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు.
అఘోరాల వేషధారణలో భిక్షాటన చేపడితే తమ ఆవేదన ప్రజలకు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు అయ్యకన్ను. 2017లో దిల్లీ వేదికగా నిరసన ప్రదర్శనలూ చేశామన్నారు.
నవంబర్ 2018న దిల్లీలో ఆత్మహత్య చేసుకున్న తమ సహచర రైతుల కపాలాల్ని పెట్టుకుని అన్నదాతలు దీక్ష చేశారు. రైతు రుణమాఫీని చేపట్టాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు నిండిన రైతులకు పెన్షన్లు అందించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకుంటే నగ్న ప్రదర్శనకు వెనకాడబోమని హెచ్చరించారు.
ఇదీ చూడండి:ఎస్పీ ప్రచారకర్తల జాబితాలో ములాయం గల్లంతు!