ETV Bharat / bharat

'హోమియోపతితో కరోనాను జయించిన బ్రిటన్​ యువరాజు' - హోమియోపతి ద్వారా కరోనా చికిత్స

బ్రిటన్​ యువరాజు చార్లెస్​కు సోకిన కరోనా వైరస్... ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స ద్వారా నయం అయినట్లు కేంద్ర ఆయుష్​ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్​ తెలిపారు. బెంగళూరుకు చెందిన సౌఖ్య ఆయుర్వేద రిసార్ట్​ యువరాజుకు చికిత్స అందించినట్లు చెప్పారు.

Ayurveda, homeopathy cured Prince Charles of Covid-19: AYUSH Minister
హోమియోపతి ద్వారా కరోనాను జయించిన ప్రిన్స్​ చార్లెస్​
author img

By

Published : Apr 3, 2020, 11:59 AM IST

Updated : Apr 4, 2020, 10:38 AM IST

కరోనా వైరస్​ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చిన్న, పెద్ద, ధనిక, పేద అన్న తేడా లేకుండా అందరినీ అనారోగ్యానికి గురిచేస్తోంది. అలానే బ్రిటన్​ యువరాజు చార్లెస్​ ఇటీవల కరోనా బారిన పడ్డారు.

అయితే... ప్రిన్స్ చార్లెస్​ ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స ద్వారా ప్రాణాంతక వైరస్​ బారి నుంచి బయటపడినట్లు కేంద్ర ఆయుష్​ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. బెంగళూరుకు చెందిన సౌఖ్య హోలిస్టిక్​ రిసార్ట్ ద్వారా చికిత్స అందించినట్లు వెల్లడించారు.

"బెంగళూరు సౌఖ్య ఆయుర్వేద రిసార్ట్​కు చెందిన డాక్టర్​ మథాయ్​ నుంచి నాకు ఫోన్​ వచ్చింది. ఆయుర్వేదం, హోమియోపతి ద్వారా బ్రిటన్​ యువరాజు చార్లెస్​ మహమ్మారి కరోనా నుంచి కోలుకున్నారని నాకు చెప్పారు."

-శ్రీపాద్​ నాయక్,​ కేంద్ర మంత్రి

ప్రిన్స్ చార్లెస్​కు అందించిన చికిత్సపై అధ్యయనం చేయటం కోసం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఓ టాస్క్​పోర్స్​ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. చికిత్స చేసిన విధానంపై నివేదిక అందించాలని మథాయ్​ను కోరినట్లు వెల్లడించారు.

అంతా అసత్యం...

ఆయుర్వేదం, హోమియోపతి వైద్యంతో యువరాజు కోలుకున్నారన్న వార్తల్ని ఆయన అధికార ప్రతినిధి ఖండించారు. బ్రిటన్​ జాతీయ ఆరోగ్య సంస్థ సూచించిన చికిత్సను మాత్రమే చార్లెస్ తీసుకున్నారని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి:అమెరికా అధ్యక్షుడికి మరోసారి కరోనా పరీక్ష

Last Updated : Apr 4, 2020, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.