ETV Bharat / bharat

మతాలకు అతీతం.. అయోధ్య 'సత్యార్థ్​​'​ ఆలయం

మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ విచ్చేసే ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఓసారి అయోధ్యలోని సత్యార్థ్​ దేవాలయానికి వెళ్లండి. నగరానికి నడిబొడ్డున ఉన్న ఈ దేవాలయం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

Ayodhya
సత్యార్​ ఆలయం
author img

By

Published : Nov 25, 2020, 12:31 PM IST

సాధారణంగా అయోధ్య అనగానే అందరికీ శ్రీరాముడి జన్మస్థలం గుర్తొస్తుంది. కానీ అయోధ్య మతసామరస్యానికి మారుపేరుగా నిలుస్తోంది. ఇందుకు గుజరాతీ ధర్మశాలలో ఉన్న సత్యార్థ్​ దేవాలయం ఓ ఉదాహరణ. మతసామరస్యానికి, దేశంలోని సోదరభావానికి ఈ ఆలయం ఓ ప్రతీక. ఈ ఆలయంలో శ్రీరాముడి విగ్రహంతో పాటు ఏసుక్రీస్తు ప్రతిమ దర్శనమిస్తుంది.

Ayodhya
సత్యార్థ్​ ఆలయం

అంతేకాదు ఇస్లాం, సిక్కిజం, జైనిజం, బుద్ధిజం, జొరాస్ట్రైన్​ ఇలా వివిధ మతాలకు సంబంధించిన విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి. వారివారి మతవిశ్వాసాలకు అనుగుణంగా ఇక్కడ ప్రతి ఒక్కరు తలవంచుతారు.

3 దశాబ్దాలుగా..

హనుమాన్​ గఢీ సమీపంలో ఉండే గుజరాతీ ధర్మశాలలోని ఈ ఆలయం మూడు దశాబ్దాల కిందటిది.

Ayodhya
అయోధ్యలోని గుజరాతీ​ ధర్మశాల
Ayodhya
అయోధ్యలోని గుజరాతీ​ ధర్మశాల

ఎందరో ప్రముఖులు..

సామాజిక కార్యకర్త గౌరవ్​ తివారీ తన చిన్నప్పటి నుంచి ఈ ఆలయాన్ని దర్శిస్తున్నట్లు చెప్పారు. భక్తులు తమ విశ్వాసాలకు అనుగుణంగా ఇక్కడ పూజలు చేస్తారని పేర్కొన్నారు.

బాబ్రీ మసీదు కేసులో కీలక పిటిషన్​దారు ఇక్బాల్​ అన్సారీ, శ్రీ రామ్​లల్లా ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్​ సైతం ఈ ఆలయ భక్తులు కావడం విశేషం.

ఈ అయోధ్యలో ప్రతి మతానికి ఒక గౌరవం ఉంది. సత్యార్థ్​ ​ఆలయంలో ప్రతి మతానికి సంబంధించిన చిహ్నాలు మనకు కనిపిస్తాయి. భక్తులు వారి మతవిశ్వాసాల ప్రకారం ఇక్కడ భక్తిగా ఉంటారు. దేశ ప్రజలు హిందూ-ముస్లిం అనుబంధాన్ని చూడాలంటే ఈ ఆలయాన్ని సందర్శించాలి.

- ఇక్బాల్​ అన్సారీ, బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్

అయోధ్యలో ఉన్న సరయు నదిలో ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరు స్నానం ఆచరిస్తారు. అయోధ్య..​ మతాలు, వర్గాలు ఇలా ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆరాధించే పుణ్యస్థలం. ఒక్కొక్క మతానికి ఆచారాలు వేరు కావొచ్చు.. కానీ వారు పూజించే దేవుడు మాత్రం ఒక్కడే. అందుకు ప్రతీకగా నిలుస్తోంది సత్యార్థ్ ఆలయం. అయోధ్యలో ఉన్న ఈ మతసామరస్యం భవిష్యత్తులోనూ ఇలానే ఉంటుంది.

- ఆచార్య సత్యేంద్ర దాస్, శ్రీ రామ్​లల్లా ప్రధాన అర్చకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.