ETV Bharat / bharat

'అయోధ్యలో నిర్మాణాలకు మీరూ సలహాలు ఇవ్వొచ్చు' - ఆలయ నిర్మాణం

అయోధ్య రాముడి దర్శనానికి రోజుకు లక్ష నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​. అందుకు తగిన విధంగా అవసరమైన సౌకర్యాల కల్పన, ఆలయం చుట్టూ ఉన్న 70 ఎకరాల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయటానికి ప్రజలు స్వచ్ఛందంగా సలహాలు, సూచనలు అందించాలని కోరింది​. పుష్కరణి, వివిధ మండపాలు, ఇతర నిర్మాణాల కోసం వాస్తు శాస్త్రం ప్రకారం డిజైన్ల నమూనాలు పంపించాలని సూచించింది.

Ayodhya's Ram temple
అయోధ్యలో శ్రీరాముడి ఆలయం
author img

By

Published : Nov 4, 2020, 5:01 PM IST

Updated : Nov 4, 2020, 5:29 PM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయం చుట్టూ ఉన్న 70 ఎకరాల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయటం, భక్తులకు అసవరమైన సౌకర్యాల కల్పనకు ప్రజల నుంచి సూచనలు, సలహాలను కోరింది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​.

ఆలయ నిర్మాణ పురోగతిపై సమీక్షించేందుకు కొద్ది రోజుల క్రితం సమావేశమైంది ట్రస్ట్. ఈ సందర్భంగా పుష్కరణి, యాగ మండపం, అనుస్థాన్​ మండపం, కల్యాణ మండపాల నిర్మాణం సహా రామజన్మోత్సవం, హనుమాన్​ జయంతి, రామచర్చ, సీతా వివాహం వంటి ఉత్సవాల నిర్వహణపై ప్రజలు స్వచ్ఛందంగా తమ సలహాలు, నిర్మాణాల డిజైన్ల నమూనాలు అందించాలని కోరింది. ఈ నిర్మాణ ఆకృతుల నమూనాలు భారతీయ వాస్తుశాస్త్రం లేదా స్థాపత్య వేదం ఆధారంగా ఉండాలని సూచించారు.

రోజుకు 5 లక్షల మంది భక్తులు..

ఆలయ ప్రాంగణంలోనే గురుకుల పాఠశాల, 51 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఉండేలా నివాస గృహాలకు సైతం డిజైన్లు సూచించాలని కోరింది ట్రస్ట్​. నాల్​నీల్​ తిలా, సీతాకి రాసోయి, కుబెర్​ తిలా, అంగద్​ తిలా వంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో నిర్మాణాలు ప్రధాన ఆలయంతో అనుసంధానమయ్యేలా ఆకృతులు ఉండాలని సూచించింది. అలాగే.. శ్రీరాముడిని దర్శించుకునేందుకు 1లక్ష నుంచి 5లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన ట్రస్ట్​.​. వారికి అసరమైన సౌకర్యాల కల్పనకూ నిర్మాణాల డిజైన్ల నమూనాలను కోరింది.

లైబ్రరీ, మ్యూజియం..

శ్రీరామ డిజిటల్​ లైబ్రరీ, పరిశోధన కేంద్రంతో పాటు మ్యూజియం, 5వేల మంది వరకు కూర్చునేలా ఆడిటోరియం నిర్మాణానికి డిజైన్లు సూచించాలని కోరింది ట్రస్ట్​. రామకథను మంచి ఆడియో విజ్యువల్​ ఎఫెక్ట్స్​తో తిలకించేలా మినీ థియోటర్​, అయోథ్య చుట్టు పక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి సలహాలు ఇవ్వాలని సూచించింది. వీఐపీలు, పూజారులు ఉండేలా అతిథిగృహాలు, ఓ గోశాలను నిర్మించాలని ప్రణాళిక చేస్తోంది ట్రస్ట్​.

రామ మందిర నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఇంజినీర్లు ఆలయ ప్రాంతంలోని మట్టిని పరీక్షిస్తున్నారని ఆగస్టు 20న తెలిపింది ట్రస్ట్​.

ఇదీ చూడండి: 'అయోధ్య గుడి నిర్మాణాన్ని కళ్లారా చూడొచ్చు!'

Last Updated : Nov 4, 2020, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.