కార్యక్రమం సామరస్యపూర్వకంగా జరిగిందని రామ జన్మభూమి పునరుద్ధర్ సమితికి చెందిన స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు. నిన్న ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో మొత్తం 50 మందికి పైగా పాల్గొన్నారని వెల్లడించారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ ఎమ్ ఐ ఖీలీఫుల్లా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉన్నారు.
అయోధ్యలో వివాదాస్పదమైన రామ జన్మభూమి-బాబ్రీ మసీదు సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు సుప్రీం గతవారం మధ్యవర్తిత్వ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.