ETV Bharat / bharat

ఆ సొమ్మును రామమందిర ట్రస్ట్​కు తిరిగి ఇచ్చిన ఎస్​బీఐ - అయోధ్య రామమందిర ట్రస్ట్

శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతా​ నుంచి గత వారం మోసపూరితంగా విత్​డ్రా అయిన సొమ్మును ఎస్​బీఐ తిరిగి జమ చేసింది. డబ్బు ఉపసంహరణ కోసం దుండగులు పీఎన్​బీ నకిలీ చెక్కులను ఉపయోగించారని, ఆ మొత్తాన్ని సదరు బ్యాంకు నుంచి వసూలు చేస్తామని ఎస్​బీఐ స్పష్టం చేసింది.

Ayodhya
రామమందిర ట్రస్ట్​
author img

By

Published : Sep 15, 2020, 11:43 AM IST

అయోధ్య రామమందిర ట్రస్ట్ ఖాతా నుంచి మోసపూరితంగా విత్​డ్రా చేసిన మొత్తం రూ.6 లక్షలను ఎస్​బీఐ తిరిగి ఇచ్చింది. డబ్బును తిరిగి చెల్లించాలని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అయోధ్య ఎస్​బీఐ శాఖ మేనేజర్ తెలిపారు.

"పంజాబ్​ నేషనల్ బ్యాంక్​కు చెందిన క్లోన్​ చెక్కులను దుండగులు వినియోగించారు. మేం మందిర ట్రస్ట్​ ఖాతాలో డబ్బును తిరిగి జమచేశాం. ఆ మొత్తాన్ని పీఎన్​బీ నుంచి వసూలు చేస్తాం."

- ప్రియాన్షు శర్మ, ఎస్​బీఐ-అయోధ్య శాఖ మేనేజర్

ఏం జరిగింది..

ట్రస్ట్‌కు చెందిన రెండు ఖాతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు సొమ్ము కాజేశారు. ఇప్పటికే రెండు సార్లు భారీ మొత్తంలో నగదును ఉపసంహరించారు. మూడోసారి కూడా డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందింది.

సెప్టెంబరు 1న లఖ్​నవూలోని ఓ బ్యాంకు ఖాతా నుంచి లక్షన్నర రూపాయలను దుండగులు చెక్ ద్వారా డ్రా చేశారు. రెండురోజుల తర్వాత మరో మూడున్నర లక్షలను ఖాతా నుంచి ఉపసంహరించారు. ఆ తర్వాత మరోసారి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు నుంచి రూ.9.86 లక్షలు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చింది.

ఇలా తెలిసింది..

క్రాస్ చెక్ కోసం అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్‌కు కాల్ చేసి అడిగారు. తాము ఎటువంటి చెక్‌ను జారీ చేయలేదని.. ఎలాంటి చెల్లింపులు చేయకూడదని స్పష్టం చేయడం వల్ల ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై అయోధ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ట్రస్ట్​. పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ఇదీ చూడండి: అయోధ్య ట్రస్ట్​ ఖాతాల నుంచి సొమ్ము చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.