ETV Bharat / bharat

రామాలయ భూమిపూజపై ఎవరేమన్నారంటే..

యావత్​ భారతావని దశాబ్దాల కలను నెరవేరుస్తూ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా దేశంలోని పలువురు నేతలు ఏమన్నారంటే..

Ayodhya temple ceremony
రామ మందిర భూమిపూజపై ఎవరేమన్నారంటే..
author img

By

Published : Aug 5, 2020, 4:12 PM IST

కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. వేదమంత్రాల నడుమ మధ్యాహ్నం భూమిపూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి పునాదిరాయి వేయటాన్ని స్వాగతించారు పలువురు నేతలు. రాముడి ఆదర్శాలను పాటిస్తూ ముందుకు సాగాలని ఆశించారు.

ఆధునిక భారతావనికి చిహ్నంగా..

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరగటం భారత సామాజిక సామరస్యానికి ప్రతీకగా పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.

" అయోధ్యలో రామాలయానికి భూమిపూజ జరగటం పట్ల అందరికీ నా శుభాకాంక్షలు. చట్టాలకు అనుగుణంగా ఆలయం నిర్మితమవుతోంది. ఇది భారతదేశ సామాజిక సామరస్యాన్ని, ప్రజల సంకల్పాన్ని సూచిస్తోంది. రామరాజ్య ఆదర్శాలకు సాక్ష్యంగా, ఆధునిక భారతానికి చిహ్నంగా ఈ ఆలయం ఉంటుంది."

- రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి.

మోదీ బలమైన నాయకత్వాన్ని సూచిస్తోంది

" అయోధ్యలో శ్రీరాముడికి అద్భుతమైన ఆలయ నిర్మాణం చేపట్టడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వాన్ని సూచిస్తోంది. చారిత్రక రోజు సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలను, వాటి విలువలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

ఆయనే మూలం..

శ్రీరాముడు అత్యున్నతమైన మానవ విలువలకు స్వరూపమని, క్రూరత్వం, ద్వేషం, అన్యాయం వంటివి ఆయనలో మచ్చుకైన కనిపంచవన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. మన మనసులో నాటుకుపోయిన మానవతావాదానికి ఆయనే మూలమని చెప్పారు.

మన దేశం గొప్పది..

అయోధ్యలో రామాలయానికి భూమిపూజను స్వాగతించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

'దేశంలోని హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు అందరూ సోదరులే. భారతదేశం గొప్పది. పురాతన వారసత్వం భిన్నత్వంలో ఏకత్వాన్ని మన దేశం ఎల్లప్పుడూ పాటిస్తుంది. దానిని మన చివరి శ్వాస వరకు కాపాడుకోవాలి.'

- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

పేదరికాన్ని జయించేందుకు..

పేదరికం, ఆకలిని జయించేందుకు శ్రీ రాముని దివ్యాశీస్సులు ఉపయోగడతాయని వ్యాఖ్యానించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. రానున్న రోజుల్లో అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత్​ ఎదుగుతుందని, ప్రపంచానికే మార్గనిర్దేశం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చారిత్రక రోజు..

శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిన సందర్భంగా చారిత్రక రోజుగా అభివర్ణించారు కేంద్ర మంత్రి, భాజపా నేత రవిశంకర్​ ప్రసాద్​. ఈ సంతోషకరమైన క్షణాన్ని ప్రతిఒక్కరు ఆస్వాదించాలన్నారు. 'ఇది దేశం మొత్తానికి సంబంధించిన ఆలయం. భారత గొప్పతనం, ఆత్మగౌరవం, మన ఆధ్యాత్మిక వారసత్వ వేడుక' అని పేర్కొన్నారు.

దేశానికి మార్గదర్శక శక్తిగా..

శ్రీరాముడు బోధించిన త్యాగం, కరుణ, ఔదార్యం, ఐక్యత, సోదరభావం, సామరస్యం, మర్యాద వంటి ఆదర్శాలు దేశానికి మార్గదర్శక శక్తిగా మారుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. రామాలయానికి భూమి పూజ నిర్వహించిన సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నో బోధిస్తుంది..

" భగవాన్​ రామ.. మన సంస్కృతి, నాగరికతలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. ఆయన జీవితం సత్యం, న్యాయం, సమానత్వం, కరుణ, సౌభ్రాత్రం ప్రాముఖ్యాన్ని మనకు బోధిస్తుంది. రాముడు అందించిన విలువల ఆధారంగా సమతుల్య సమాజాన్ని స్థాపించటంపై దృష్టి పెట్టాలి."

- అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి.

పురుషోత్తముడి మార్గాన్ని అనుసరించాలి..

"ప్రస్తుత, భవిష్యత్తు తరాలు మర్యాద పురుషోత్తముడు చూపిన మార్గాన్ని హృదయపూర్వకంగా అనుసరిస్తాయని, అందరికీ మంచి చేసే శాంతిని స్థాపన జరుగుతుందని ఆశిస్తున్నా" అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఎస్పీ అధినేత అఖిలేష్​ యాదవ్​.

ఇవీ చూడండి: పునాది రాయితో పులకించిన అయోధ్య

భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా రామాలయ నిర్మాణం

'హిందూ సంప్రదాయానికి ఆధునిక చిహ్నం రామాలయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.