అయోధ్యలో రామమందిర నిర్మాణం కొనసాగుతున్న వేళ ప్రస్తుత ఆలయ నమూనాపై అసంతృప్తి వ్యక్తం చేశారు విశ్వ హిందూ పరిషత్‌కు చెందిన సాధువులు. నమూనాపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రస్తుత నమూనా పరిమాణం చాలా చిన్నగా ఉందని, దానిని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారీ స్థాయిలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని కోరారు.
అయోధ్యలో సమావేశమైన పలువురు సాధువులు తమను ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో 'రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు' విస్మరిస్తోందని ఆరోపించారు. పంచాయతీ వ్యవస్థను ట్రస్టు అనుసరించడం లేదని నిర్వానీ అఖాడాకు చెందిన మహంత్ ధర్మదాస్ తెలిపారు.
" శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మార్చి 19న నిర్వహించిన సమావేశంలో ముందస్తు ప్రణాళిక ప్రకారమే అంతా జరిగింది. ఎలాంటి చర్చలు లేకుండానే అన్ని నిర్ణయించారు. ప్రతి విషయంలో సాధువులను విస్మరిస్తున్నారు.
– మహంత్ ధర్మదాస్, నిర్వానీ అఖాడా
రాముడి విగ్రహాలను ఇప్పటికే తాత్కాలిక నిర్మాణానికి తరలించింది ట్రస్టు.