అయోధ్యలో రామాలయ భూమిపూజ జరగనున్న వేళ... నగరం శోభిల్లుతోంది. సరయూ నది ఒడ్డున వెలిసిన అయోధ్య... విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనుతోంది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగే భూమిపూజకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
భవనాలు, కూడళ్లు, రహదారులు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. చారిత్రక హనుమాన్‌గఢీ, కనక్‌భవన్, రాజా దశరథ్మహళ్లను... సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయోధ్యలో అడుగడుగునా పండుగ వాతావరణం నెలకొంది.
నగర వీధుల్లో విద్యుత్ దీపాల కాంతులతో అత్యంత సుందరంగా ఉంది అయోధ్య. దీపోత్సవంలో భాగంగా 'జై శ్రీరామ్', 'ఓం' సహా పలు ఆకారాల్లో ప్రమిదలు పేర్చి... దీపాలు వెలిగించారు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక నివాసంలో దీపాలు వెలిగించారు. మధ్యప్రదేశ్‌లో బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు భాజపా కార్యకర్తలు.
ఇదీ చూడండి: రామ్‌లల్లా వస్త్రాలంకణ బాధ్యత లాల్ కుటుంబానిదే!