నేడు సుప్రీంకోర్టులో వివాదాస్పద రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసు విచారణ జరగలేదు. ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో ఒకరు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు(8వ రోజు) రామ్‌లల్లా తరఫు న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినాల్సి ఉంది. జస్టిస్ బాబ్డే అందుబాటులో లేకపోవడం వల్ల విచారణ జరగలేదు.
7వ రోజు విచారణలో భాగంగా... అయోధ్య వివాదాస్పద భూమిలో ఉన్న స్తంభాలపై హిందూ దేవతల చిత్రాలున్నాయని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు వైద్యనాథన్. భూమిని పరీక్షించడానికి కోర్టు నియమించిన కమిషనర్ అందించిన నివేదిక ద్వారా ఇది స్పష్టమవుతోందని అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు.
అయోధ్య కేసు పరిష్కారంలో 'మధ్యవర్తిత్వం' విఫలమవడం వల్ల రోజువారీ విచారణ జరపడానికి అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే నిర్ణయించింది.
ఇదీ చూడండి:- 'అయోధ్యలో స్తంభాలపై హిందూ దేవతలున్నారు
'