ఆయోధ్య భూ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రామ జన్మ భూమి-బాబ్రీ మసీదు కేసులో కోర్టు వెలుపల పరిష్కారమే సరైన మార్గమని ముస్లిం మేధావుల వేదిక అభిప్రాయపడింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ముస్లింలు వ్యతిరేకించకూడదని సూచించింది.
అయోధ్య కేసులో పిటీషనర్లుగా ఉన్న ముస్లింలు.. రామమందిర నిర్మాణానికి తమవంతు భూభాగాన్ని హిందూ పక్షానికి ఇవ్వడం మేలని మేధవుల వేదిక ప్రతిపాదించింది. ఈ కేసులో ముస్లింలు గెలిచినా.. ఇదే పంథాను పాటించడం ఉత్తమమని పేర్కొంది.
మాజీ ఐఏఎస్ అధికారి అనీస్ అన్సారీ, మాజీ ఐపీఎస్ నిసార్ అహ్మద్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దిన్ షా, పద్మశ్రీ గ్రహిత మన్సూర్ అహ్మద్, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి మొయీన్ అహ్మద్‌లు సభ్యులుగా ఉన్న 'ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ పీస్' వేదిక ఈ విషయాలు వెల్లడించింది.
ఇదీ చూడండి: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మూడేళ్లుగా కుట్ర!